చిరు, చరణ్ తో మిస్.. సుజీత్ గ్యాప్ అందుకేనా!!
అయితే సాహోకు.. ఓజీకి మధ్య గ్యాప్ పై ఇప్పటికే వార్తలు రాగా.. ఇప్పుడు సుజీత్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి సాహో తర్వాత సుజీత్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో వర్క్ చేయాల్సి ఉంది.
By: M Prashanth | 26 Sept 2025 11:33 AM ISTటాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ ఇప్పుడు సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. రన్ రాజా రన్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. డెబ్యూతో సూపర్ హిట్ ను అందుకున్నారు. ఆడియన్స్ ను తెగ మెప్పించారు. ఆ వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ అందుకుని సాహో చేశారు.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. తెలుగు ఆడియన్స్ కు పెద్దగా ఎక్కలేదు. కానీ నార్త్ లో మంచి వసూళ్లు సాధించింది. ఒక్క హిందీ వెర్షన్ నుంచి రూ.170 కోట్లు రాబట్టడం విశేషం. అయితే సాహో వచ్చిన ఐదేళ్ల తర్వాత ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుజీత్. ఫ్యాన్స్ ను విపరీతంగా తన వర్క్ తో ఆకట్టుకున్నారు.
అయితే సాహోకు.. ఓజీకి మధ్య గ్యాప్ పై ఇప్పటికే వార్తలు రాగా.. ఇప్పుడు సుజీత్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి సాహో తర్వాత సుజీత్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో వర్క్ చేయాల్సి ఉంది. అప్పుడు స్క్రిప్ట్ ను రెడీ చేసి ఆయనకు నెరేట్ చేశారు సుజీత్. ఇంగ్లాండ్ లో షూట్ చేసేందుకు ప్లాన్ చేశారు. అప్పుడే కోవిడ్ వైరస్ విజృంభించింది.
దీంతో ఫారిన్ లో షూటింగ్ చేసేందుకు వీలు లేకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి సుజీత్ పిలుపు అందుకున్నారు. మాలీవుడ్ మూవీ లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. కొంత కాలం వర్క్ చేసి.. రీమేక్ వద్దని ఫిక్స్ అయ్యారు. చిరుకు చెప్పి మరీ డ్రాప్ అయ్యారు.
ఆ తర్వాత ముంబై వెళ్లిన సుజీత్.. అక్కడ ఓ హీరోతో వర్క్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకున్న టైమ్ లో పవన్ మూవీ కోసం త్రివిక్రమ్ ద్వారా నిర్మాత దానయ్య నుంచి పిలుపు అందుకున్నారు. తన అభిమాన హీరోతో సినిమా అంటే వదులుకుంటారా.. వెంటనే హైదరాబాద్ కు వచ్చేశారు.
తాను రాసుకున్న కథను పవన్ కు నెరేట్ చేసి ఒప్పించారు. దానయ్యను సాటిస్ఫై చేశారు. దీంతో సినిమా పట్టాలెక్కింది. మధ్యలో పవన్ రాజకీయ కారణాల వల్ల గ్యాప్ వచ్చినా.. ఇప్పుడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకోసం సుజీత్ బాగా కష్టపడ్డారని క్లియర్ గా తెలుస్తోంది. మొత్తానికి అప్పుడు చరణ్, చిరుతో ప్రాజెక్టులు మిస్ అవ్వగా.. ఇప్పుడు పవన్ తో సినిమాను తీసి ప్రశంసలు అందుకుంటున్నారు సుజీత్.
