రైటింగ్ వీక్ అయితే డైరెక్టర్ టాలెంట్ వీక్ అయిపోతుందా?
పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ఆ సినిమా మేకింగ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కథను ఎలా చెప్పాడనే అంశంతో పాటు వరల్డ్ ఎలా క్రియేట్ చేశాడు,
By: M Prashanth | 4 Oct 2026 6:00 AM ISTఒక సినిమా ఫ్లాప్ అయితే ముందుగా దర్శకుడి మీదే విమర్శలు వస్తాయి. కథ బాగోలేదు, సీన్లు వర్కౌట్ కాలేదు, స్క్రీన్ ప్లేలో తప్పులు ఉన్నాయంటూ టాక్ వస్తుంది. కానీ రైటింగ్ లో వచ్చిన లోపాలు దర్శకుడి మొత్తం టాలెంట్ ను తక్కువ చేసి చూపిస్తాయా, సినిమా రిజల్ట్, దర్శకుడి మేకింగ్ స్టామినా రెండింటినీ ఒకేలా చూడొచ్చా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకుడు సుజీత్ సినిమాల విషయంలో ఇదే చర్చ కనిపిస్తోంది. రన్ రాజా రన్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన సుజీత్ తొలి సినిమాతోనే తన మేకింగ్ లో స్పెషాలిటీ చూపించారు. తక్కువ బడ్జెట్ లోనే కొత్తగా కనిపించే ట్రీట్మెంట్ తో సినిమా తీసి మెప్పించారు. ఆ తర్వాత ప్రభాస్ తో సాహో వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. సాహో విషయంలో కథ, స్క్రీన్ ప్లేపై విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా సినిమా రన్ టైమ్, స్టోరీ, కొన్ని సీన్స్ కనెక్షన్ విషయంలో ప్రేక్షకుల నుంచి భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో సినిమా మేకింగ్, యాక్షన్ సీన్లు, విజువల్ ప్రెజెంటేషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. తెలుగు సినిమా రేంజ్ లో అప్పట్లో కనిపించని భారీ యాక్షన్ స్కేల్ ను చూపించే ప్రయత్నం చేశాడు సుజీత్. ఇక ఓజీ విషయంలోనూ అప్పుట్లో డిబేట్ జరిగింది.
పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ఆ సినిమా మేకింగ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కథను ఎలా చెప్పాడనే అంశంతో పాటు వరల్డ్ ఎలా క్రియేట్ చేశాడు, యాక్షన్ ను ఎలా చూపించాడనే విషయాలు కూడా దర్శకుడి స్టామినా అంచనా వేయడంలో కీలకంగా మారాయి. ఇక్కడే రైటింగ్, మేకింగ్ మధ్య తేడా కనిపిస్తుంది. ఒక దర్శకుడికి కథను అద్భుతంగా రాసే టాలెంట్ ఉండొచ్చు.
మరో దర్శకుడికి కథను స్క్రీన్ పై భారీగా, కొత్తగా చూపించే స్టామినా ఉండొచ్చు. ఇంకొకరికి రెండూ ఈక్వెల్ గా ఉండొచ్చు. కాబట్టి ఒక డిపార్ట్మెంట్ లో వచ్చిన లోపాన్ని బట్టి దర్శకుడి మొత్తం టాలెంట్ ను కొట్టిపారేయడం సరైన అంచనా కాదనే వాదన ఉంది. సినిమా అనేది కథ మాత్రమే కాదు. కథను తెరపై చూపించే విధానం కూడా అంతే ముఖ్యం. కెమెరా, యాక్షన్, సెట్స్, లొకేషన్స్, నటీనటుల ప్రెజెంటేషన్, బ్యాక్ గ్రౌండ్.. ఇలా చాలా అంశాలు కలిసి ఒక దర్శకుడి మేకింగ్‌ను నిర్ణయిస్తాయి. ఇందులో ఒకటి స్ట్రాంగ్ గా ఉండి, మరొకటి వీక్ గా ఉంటే సినిమా మొత్తం ఎఫెక్ట్ తగ్గొచ్చు.
అందుకే ఒక సినిమా నచ్చలేదంటే దర్శకుడిలో టాలెంట్ లేదని చెప్పడం, అలాగే సినిమా బాగుంటే ప్రతి విషయం స్ట్రాంగ్ ఉందని అనుకోవడం రెండూ ఒకేలా సరైనవి కావు. రైటింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయనే విమర్శ ఉండొచ్చు. కానీ భారీ స్థాయిలో సినిమాను నిర్మించడం, తన విజన్ ను స్క్రీన్ పై చూపించడం కూడా డైరెక్టర్ టాలెంట్ లో భాగమే. అందుకే రైటింగ్ వీక్ అయితే దర్శకుడి టాలెంట్ మొత్తం వీక్ అయిపోతుందా అనే ప్రశ్నకు ఆన్సర్ అంత సింపుల్ గా ఉండదు.
