Begin typing your search above and press return to search.

పవన్ 'OG-2'కి బ్రేక్.. సుజీత్ ప్లాన్ ఏంటి?

నాని హీరోగా తెరకెక్కనున్న 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్‌పై ఉన్న అనుమానాలన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి. నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమా పనులు ఒక కొలిక్కి రావడంతో, ఈ మూవీకి లైన్ క్లియర్ అయింది.

By:  Madhu Reddy   |   5 Aug 2026 10:59 AM IST
పవన్ OG-2కి బ్రేక్.. సుజీత్ ప్లాన్ ఏంటి?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో 'OG-2' ప్రకటన రాగానే, నాని హీరోగా రావాల్సిన 'బ్లడీ రోమియో' సినిమా వెనక్కి వెళ్లిపోయిందనే ప్రచారం గట్టిగా సాగింది. సుజీత్ కూడా ఓజీ-2 ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యలు, బిజీ షెడ్యూల్ కారణంగా 'ఓజీ-2' సినిమా కొంత ఆలస్యంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీంతో సుజీత్ ముందనుకున్న ప్లాన్ ప్రకారమే నాని సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు.

సెట్స్‌పైకి 'బ్లడీ రోమియో':

నాని హీరోగా తెరకెక్కనున్న 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్‌పై ఉన్న అనుమానాలన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి. నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమా పనులు ఒక కొలిక్కి రావడంతో, ఈ మూవీకి లైన్ క్లియర్ అయింది. ఇక నాని కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పక్కాగా డేట్లు కేటాయించడంతో, అనుకున్న సమయానికే సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్రబృందం సర్వం సిద్ధం చేస్తోంది.

ఢిల్లీ, లండన్‌లలో ప్లానింగ్:

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి వేగంగా ప్రారంభం కానుంది. మొదట ఢిల్లీ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇక ఆ తర్వాత లండన్‌లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఇక ఎక్కడా విరామం లేకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలనే పక్కా టార్గెట్‌తో సుజీత్ అడుగులు వేస్తున్నారు.

2027 సమ్మర్ రిలీజ్ టార్గెట్:

షూటింగ్ వేగంగా పూర్తి చేసి, గ్రాండ్ ప్రాసెస్ ముగించుకున్నాక ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా ప్రేక్షకు ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సుజీత్ మార్క్ స్టైలిష్ టేకింగ్, నాని విలక్షణ నటన కలసి ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద సరికొత్త స్థాయిలో నిలబెడతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ఈ సినిమాలో నాని గతంలో గ్యాంగ్‌స్టర్‌గా ఉండి, తర్వాత చెఫ్‌గా మారిన వ్యక్తి పాత్రలో కనిపించనున్నాడు. ఇక 'ది ప్యారడైజ్' కోసం ఎదురుచూస్తూ నిరాశ చెందిన అభిమానులకు 'బ్లడీ రోమియో' త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందనే వార్త సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'‘బ్లడీ రోమియో’ పూర్తయ్యాకే సుజీత్, పవన్ కళ్యాణ్ ‘OG-2’పై పని ప్రారంభించనున్నారు. ఎలాంటి గందరగోళం లేకుండా నాని సినిమాను పర్ఫెక్ట్‌గా పూర్తి చేసి, ఆ తర్వాతే భారీ అంచనాలున్న పవన్ కళ్యాణ్ ఓజీ-2 వైపు వెళ్లాలని సుజీత్ స్పష్టమైన ప్లాన్‌తో ఉన్నారు.