స్టార్ యాక్టర్స్ కి ఉన్న పవర్ అలాంటిది..
స్టార్ యాక్టర్స్ కి ఉండే పవర్ గురించి మరొకసారి ఓజీ డైరెక్టర్ సుజీత్ గుర్తు చేశారు.. ఒక షాట్ స్టార్ యాక్టర్ చేతిలోకి పడింది అంటే ఎలాంటి సన్నివేశమైనా సరే దానికి ఊహించని పాపులారిటీ లభించాల్సిందే.
By: Madhu Reddy | 22 Dec 2025 9:30 AM ISTస్టార్ యాక్టర్స్ కి ఉండే పవర్ గురించి మరొకసారి ఓజీ డైరెక్టర్ సుజీత్ గుర్తు చేశారు.. ఒక షాట్ స్టార్ యాక్టర్ చేతిలోకి పడింది అంటే ఎలాంటి సన్నివేశమైనా సరే దానికి ఊహించని పాపులారిటీ లభించాల్సిందే. అలా ప్రయోగం చేసి ఒక షాట్ కి ఊహించని క్రేజ్ తీసుకొచ్చారు సుజీత్.
మరి అసలు విషయం ఏమిటంటే.. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు.. ప్రభాస్ తో సాహో.. పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాలు చేసి పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ఈయన.. తాజాగా 2009లో తాను తీసిన ఒక షార్ట్ ఫిలింలోని షాట్ ను పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమాలో పెట్టానని.. ఆ లఘు చిత్రంలోని షాట్ కి ఇప్పటికి తక్కువ వ్యూస్ ఉన్నాయి అని.. అదే సినిమాలో చూసిన వారంతా వావ్ అంటున్నారు అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
అంతేకాదు స్టార్ యాక్టర్స్ కి ఉన్న పవర్ అలాంటిది అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. సుజీత్ మాట్లాడుతూ ఓజీ సినిమా షూటింగ్ కి ముందే నేను డెమో షూట్ చేశాను.. ఆ ఫుటేజ్ నిడివి 2:35 గంటలు. ఆ డెమో కారణంగానే నేను సినిమా షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేయగలిగాను.. ఏది ఏమైనా ఎలాంటి గుర్తింపు దక్కని ఒక షాట్ ను స్టార్ తో తెరకెక్కించడం వల్ల దాని స్థాయి పెరిగిపోయింది అంటూ తెలిపారు.
ఇకపోతే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా ఓటీటీలో ప్రదర్శితం అవుతోంది. ఇకపోతే సుజిత్ చెప్పిన ఆ షాట్ ఏంటో కాదు నీటిలో హీరో అడుగుపెట్టడం .. ఆ రిఫ్లెక్షన్ ను హైలెట్ చేస్తూ నటుడి వైపు కెమెరాను ఫోకస్ చేయడం చూడవచ్చు.. అందుకు సంబంధించిన వీడియోలు, కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సుజీత్ విషయానికి వస్తే.. తొలిసారి రన్ రాజా రన్ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇకపోతే సినిమాల్లోకి రాకముందు చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసిన ఈయన.. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి, తన అభిరుచిని చాటుకుంటున్నారు. 1990 అక్టోబర్ 25న ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో జన్మించిన ఈయన.. ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడు అయ్యాడు..తన మొదటి సినిమాను పక్కన పెడితే.. రెండు, మూడవ చిత్రాలను ఏకంగా స్టార్స్ తో తెరకెక్కించడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు. ప్రస్తుతం సుజీత్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే..
