Begin typing your search above and press return to search.

'మండాడి'లో వైల్డ్.. తమిళ ఎంట్రీకి ఇదే బెస్ట్: సుహాస్ స్పెషల్ ఇంటర్వ్యూ

సుహాస్ ఇప్పుడు ‘మండాడి’తో తమిళంలోకి అడుగుపెడుతున్నాడు. సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో అతను హీరోగా కాదు, విలన్‌గా కనిపించబోతున్నాడు.

By:  M Prashanth   |   3 Sept 2026 11:42 AM IST
మండాడిలో వైల్డ్.. తమిళ ఎంట్రీకి ఇదే బెస్ట్: సుహాస్ స్పెషల్ ఇంటర్వ్యూ
X

సుహాస్ ఇప్పుడు ‘మండాడి’తో తమిళంలోకి అడుగుపెడుతున్నాడు. సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో అతను హీరోగా కాదు, విలన్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా పాజిటివ్ పాత్రల్లో కనిపించిన సుహాస్, ఈసారి పూర్తిగా వైల్డ్ క్యారెక్టర్ చేశానని చెప్పాడు. కథ తనకు బాగా నచ్చడంతో పాటు, విలన్ పాత్రకు మంచి స్కోప్ ఉండటంతో తమిళ డెబ్యూకి ఇదే సరైన సినిమా అనిపించిందని తెలిపాడు. Tupaki.comకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.

సూరితో కలిసి పనిచేయడం కూడా తనకు మంచి అనుభవమని సుహాస్ చెప్పాడు. మొదటి నుంచే చాలా కేరింగ్‌గా చూసుకున్నారని, ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. మంచి ఫుడ్ పెట్టించడంతో పాటు సెట్లో ఎప్పుడూ సరదాగా ఉండేవారని అన్నాడు. వెట్రిమారన్ ఈ సినిమాకు నిర్మాతగా ఉండటం కూడా ప్రాజెక్ట్‌కు మరో ప్లస్. సినిమా చూసిన తర్వాత తన రెండు గెటప్స్ చాలా బాగా వచ్చాయని వెట్రిమారన్ మెచ్చుకున్నట్టు చెప్పాడు.

‘మండాడి’ షూటింగ్‌లో పెద్ద ఛాలెంజ్ మాత్రం సముద్రంలో తీసిన క్లైమాక్స్. దాదాపు 45 రోజుల పాటు ఆ భాగాన్ని షూట్ చేశారట. కొంచెం రిస్క్ కూడా ఉంటుందని, కానీ జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పరు. ఇక మొత్తం సినిమా కోసం 130 రోజుల వరకు పని చేశామని సుహాస్ వెల్లడించాడు. తన కెరీర్‌లో ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలో పనిచేయడం ఇదే తొలిసారి అని, ఆ అనుభవం కూడా కొత్తగా అనిపించిందని చెప్పాడు.

పాత్ర కోసం షూటింగ్‌కు డైరెక్ట్ గా వెళ్లిపోలేదట. ముందుగా 15 రోజుల పాటు ఒక గ్రామంలో ఉండి మేకోవర్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్‌పై వర్క్ చేసినట్లు తెలిపారు. సినిమాలో ఒక ప్రత్యేకమైన రేస్ కూడా ఉంటుందని, అది ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుందని సుహాస్ చెప్పాడు. కథ కూడా ఇంతకుముందు చూడని విధంగా ఉంటుందని తనకు నమ్మకం ఉందన్నాడు.

తన గత సినిమాల ఫలితాల గురించి అడిగినప్పుడు కూడా సుహాస్ ఎక్కడా డిఫెన్సివ్‌గా మాట్లాడలేదు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా తన సెలెక్షన్లపై రిగ్రెట్స్ లేవని చెప్పాడు. ఈ స్థాయికి వస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదని, ఇప్పుడు చాలా మంది నిర్మాతలు తన దగ్గరకు కథలతో వస్తుండటం సంతోషంగా ఉందన్నాడు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేయాలనేది తన ప్లాన్ అని చెప్పాడు. మొదట ‘మండాడి’ని తమిళం, తెలుగులోనే రిలీజ్ చేయాలని అనుకున్నారని, తర్వాత పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నట్టు చెప్పడంతో ఇంకా హ్యాపీగా అనిపించిందని సుహాస్ తెలిపాడు.