సుహాస్ 'మండాడి'.. పెద్ద పని పూర్తయినట్లే..
టాలీవుడ్ నటుడు సుహాస్, కోలీవుడ్ యాక్టర్ సూరి లీడ్ రోల్స్ తెరకెక్కుతున్న మండాడి చిత్రం షూటింగ్ పూర్తయింది.
By: M Prashanth | 25 April 2026 5:07 PM ISTటాలీవుడ్ నటుడు సుహాస్, కోలీవుడ్ యాక్టర్ సూరి లీడ్ రోల్స్ తెరకెక్కుతున్న మండాడి చిత్రం షూటింగ్ పూర్తయింది. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఆ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మొదటి నుంచే ఆసక్తి క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్లతోనే ప్రేక్షకుల్లో మంచి హైప్ తెచ్చుకున్న ఆ సినిమా తీరప్రాంతం, మత్స్యకారుల జీవన నేపథ్యంలో రూపొందుతోంది.
రామనాథపురం ప్రాంతంలోని సముద్రతీరాల్లో షూటింగ్ జరగడం విశేషం. దర్శకుడు మదిమారన్ పుగళేంది ఆ చిత్రాన్ని ఎంతో రియలిస్టిక్ గా తెరకెక్కించేందుకు కష్టపడ్డారు. కథకు తగ్గట్టుగా రియల్ లొకేషన్లలో షూటింగ్ నిర్వహించడం వల్ల విజువల్ గా కూడా సినిమాకు ప్రత్యేకత వచినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా సాగిన లాంగ్ షెడ్యూల్ లో తీసిన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే సెయిల్ బోట్ రేస్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
షూటింగ్ పూర్తవడంతో ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లింది మండాడి మూవీ. ఎడిటింగ్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా బెస్ట్ అవుట్ పుట్ ను అందించేందుకు టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. చిత్రంలో సూరి తన పాత్ర కోసం ఫిజికల్ పరంగా చాలా కష్టపడ్డారని సమాచారం.
మరోవైపు.. సుహాస్ మండాడి సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న విభిన్న పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్ర కోసం ఆయన పూర్తి మేకోవర్ తీసుకోవడమే కాకుండా, దాదాపు 100 రోజుల కాల్ షీట్లను కేటాయించడం ఆయన డెడికేషన్ ను చూపిస్తోంది. హీరోయిన్ గా మహిమా నంబియార్ నటిస్తుండగా, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సాంకేతికంగా కూడా మండాడి స్ట్రాంగ్ గా నిలుస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ ను డి.ఆర్.కె. కిరణ్ చేపట్టగా, ఎడిటింగ్ బాధ్యతలను ప్రదీప్ ఇ. రాఘవ్ నిర్వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కలిసి రూపొందించారు.
మండాడి టైటిల్ కు ప్రత్యేక అర్థం ఉంది. సముద్రం, గాలులు, అలలపై అవగాహనతో మత్స్యకార బృందాన్ని ముందుకు నడిపించే నాయకుడిని మండాడి అంటారు. ఆ నాయకుడి ఫీలింగ్స్, ఎక్స్పీరియన్స్, లైఫ్ జర్నీ కథలో ప్రధానంగా ఉండనున్నాయి. ఏదేమైనా.. విభిన్న కథా నేపథ్యం, మంచి నటీనటులు, స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ తో మండాడి చిత్రం భారీ అంచనాలను నెలకొల్పుతోంది. ఇప్పటికే ఆసక్తి పెంచిన ఆ సినిమా నుంచి త్వరలో మరిన్ని అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది.
