సాట్టపులి 'సుహాస్'.. ఇది కదా సరైన రోల్ అంటే..!
విభిన్నమైన కథలు, నేచురల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్ మరోసారి కొత్త అవతార్ లో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.
By: M Prashanth | 27 Jun 2026 9:57 AM ISTవిభిన్నమైన కథలు, నేచురల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్ మరోసారి కొత్త అవతార్ లో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా పక్కింటి కుర్రాడి తరహా పాత్రల్లో కనిపించిన ఆయన.. ఇప్పుడు కంప్లీట్ ఊరమాస్, రస్టిక్ లుక్ లో కనిపించనున్న చిత్రం మండాడి. రీసెంట్ గా విడుదలైన సుహాస్ రోల్ మేకింగ్ వీడియో చూస్తే.. ఆ సినిమ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోలీవుడ్ హీరో సూరి, సుహాస్ లీడ్ రోల్స్ లో రూపొందుతున్న ఆ చిత్రం స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. సముద్ర తీరప్రాంతం, మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఆ కథలో సుహాస్ సాట్టపులి అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఆ క్యారెక్టర్ ను దర్శకుడు మదిమారన్ పుగళేంది రూపొందించినట్లు మేకింగ్ వీడియో ద్వారా అర్థమవుతోంది.
వీడియోలో సుహాస్ మేకోవర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రఫ్ గెటప్, చేతిలో కత్తి, కళ్లలో ఇంటెన్సిటీతో ఆయన కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా థియేటర్లలో మాస్ ప్రేక్షకులు విజిల్స్ వేయించేలా ఉండే బాడీ లాంగ్వేజ్, యాక్షన్ షాట్లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. సుహాస్ లో ఇలాంటి మాస్ యాంగిల్ ను ఇప్పటివరకు పెద్దగా చూడని ప్రేక్షకులకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సూరి, సుహాస్ ఇద్దరి రోల్స్ లో కథలో ఈక్వల్ ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఇద్దరి మధ్య వచ్చే ఎమోషన్, యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని సమాచారం. తీరప్రాంత జీవితం, అక్కడి ప్రజల ఎమోషన్స్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కలిపి ఆ కథను రూపొందించడం కూడా ఆసక్తిని పెంచుతోంది. దాదాపు రూ.80 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న ఆ చిత్రాన్ని ఎక్కువ భాగం రియల్ లొకేషన్లలో చిత్రీకరించారు.
సముద్రంపై సాగే బోట్ యాక్షన్ ఎపిసోడ్లు, భారీ ఫైట్ సీన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ కు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ వంటి ప్రముఖ ఫైట్ మాస్టర్లు వర్క్ చేయడం విశేషం. సుహాస్ సరసన మహిమా నంబియార్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటివరకు కంటెంట్ బేస్డ్ చిత్రాలతో నటుడిగా తన టాలెంట్ నిరూపించుకున్న సుహాస్.. ఇప్పుడు సాట్టపులి లాంటి మాస్ పాత్రతో తనలోని మరో యాంగిల్ చూపించేందుకు సిద్ధమయ్యారు. పాత్ర కోసం చేసిన మేకోవర్ చూస్తే.. ఇది ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్రగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఫ్యాన్స్ సుహాస్ కు ఇలాంటి పాత్రలు అసలు సిసలు సరైనవని అంటున్నారు.
