రేసిజం కాంట్రవర్సీ.. సుహాస్ రెస్పాన్స్ ఏంటంటే?
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ రీసెంట్ గా మండాడి మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగా, ఆ సినిమా సక్సెస్ మీట్‌లో దర్శకుడు మతిమారన్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 18 Sept 2026 3:52 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ రీసెంట్ గా మండాడి మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగా, ఆ సినిమా సక్సెస్ మీట్‌లో దర్శకుడు మతిమారన్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సుహాస్ తన సొంత పరిశ్రమలోనే రంగు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఆ వ్యవహారంపై సుహాస్ రెస్పాండ్ అవుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు మతిమారన్ మాట్లాడుతూ.. సుహాస్ తన సొంత ఇండస్ట్రీ, స్టేట్ లోనే రేసిజం పరిస్థితులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. అయితే తమిళ ఆడియన్స్ మాత్రం ఆయనను ప్రేమతో యాక్సెప్ట్ చేశారని చెప్పారు. తమిళనాడులో రేసిజం ఉండదని అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుహాస్ పై కూడా చర్చ మొదలైంది.
ఆ సమయంలో సుహాస్ డైరెక్టర్ కామెంట్స్ ను చిరునవ్వుతో విన్నారే తప్ప.. అక్కడికక్కడే వాటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కొందరు తెలుగు నెటిజన్లు ఆయన స్పందించాల్సిందని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రేక్షకులు సుహాస్ ను ఎప్పటి నుంచో ఆయన నటన ఆధారంగా ఆదరిస్తున్నారని గుర్తుచేశారు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాలతో ఆయనకు వచ్చిన గుర్తింపును కూడా ప్రస్తావించారు.
ఇలాంటి సమయంలో సుహాస్ ఇప్పుడు తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో తన జర్నీ గురించి చెప్పుకొచ్చారు. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే రేంజ్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత హీరోగా ఎదిగే వరకు తెలుగు ప్రేక్షకులు తనకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. తన కెరీర్ లో ప్రతి అడుగులో కూడా ప్రేక్షకుల లవ్, ఎంకరేజ్మెంట్ తనను ముందుకు తీసుకెళ్లాయని సుహాస్ తెలిపారు.
తాను ఈరోజు ఈ రేంజ్ లో ఉండటానికి కారణం ప్రేక్షకుల రెస్పాన్స్ అని చెప్పారు. అదే గుర్తింపు మండాడిలో నటించే ఛాన్స్ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. తనను ఆడియన్స్ ఎప్పుడూ కలర్, గ్లామర్ వంటి వాటితో కాకుండా తన వర్క్, యాక్టింగ్ ఆధారంగా ఆదరించారని సుహాస్ తన నోట్ లో గుర్తుచేశారు. తన జర్నీ అందుకు ఎగ్జాంపుల్ అని చెప్పారు. తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన వారిని, ఈ స్థాయికి చేరుకునేలా ఎంకరేజ్ చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోనని స్పష్టం చేశారు.
మండాడిపై ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ చెప్పారు. ఇకపై కూడా తన యాక్టింగ్ తో ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడతానని సుహాస్ అన్నారు. అయితే ప్రెస్ నోట్ లో దర్శకుడి కామెంట్స్ ను సమర్థించడం కానీ, ఖండించడం కానీ సుహాస్ చేయలేదు. తన కెరీర్ లో తెలుగు ఆడియన్స్ రోల్ ను, వారి లవ్ ను మాత్రం క్లియర్ గా గుర్తుచేశారు.
