నేను పేదోడిని కాదు.. వైరల్ అవుతున్న సుహాస్ కామెంట్స్!
మామూలుగా ఏదైనా రెండు సినిమాల్లో వరుసగా ఒకే తరహా సీన్లు, లేదా ఒకే తరహా క్యారెక్టర్లు చేస్తే వారిని సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఆడుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 30 Jan 2026 4:00 AM ISTమామూలుగా ఏదైనా రెండు సినిమాల్లో వరుసగా ఒకే తరహా సీన్లు, లేదా ఒకే తరహా క్యారెక్టర్లు చేస్తే వారిని సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఆడుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్టర్ సుహాస్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. సుహాస్ నటించిన సినిమాల్లో ఇప్పటివరకు అతను ఎక్కువగా పేదవాడిగానే కనిపించడంతో ఈ విషయంలో సుహాస్ పై మీమ్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి.
సుహాస్ హీరోగా హే భగవాన్
అయితే ఇప్పుడు సుహాస్ తన జోన్ నుంచి బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. తన రాబోయే సినిమా హే భగవాన్ లో తాను అలా కనిపించనంటున్నారు. సుహాస్ హీరోగా శివానీ నగరం హీరోయిన్ గా గోపీ అచ్చర దర్శకత్వంలో రాబోతున్న సినిమా హే భగవాన్. సీనియర్ యాక్టర్ నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
ఫిబ్రవరి 20న హే భగవాన్ రిలీజ్
ఫిబ్రవరి 20న హే భగవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. రీసెంట్ గా రిలీజైన చిత్ర టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే టీజర్ లాంచ్ ఈవెంట్ లో సుహాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హే భగవాన్ టీజర్ లాంచ్ పోస్టర్ రిలీజ్ చేయగానే, మళ్లీ అలాంటి సినిమానేనా అని తనకు కొన్ని మెసేజ్‌లు వచ్చాయన్నారు.
చాలా డిఫరెంట్ గా ఉంటుంది
అయితే ఈ సినిమా తన గత సినిమాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఈ మూవీలో తాను చనిపోనని, తన లవర్ కు మరొకరితో పెళ్లి అవదని, అన్నింటికంటే ముఖ్యంగా తాను ఈ సినిమాలో పేద వాడిని కాదని సరదాగా చెప్పారు. సుహాస్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. హే భగవాన్ మూవీ చాలా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని సుహాస్ ఈ సందర్భంగా చెప్పారు.
కెరీర్ లో పెద్ద హిట్ గా నిలుస్తుంది
హే భగవాన్ లో తాను కామెడీ బాగా చేశానని, తనతో పాటూ నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్ అందరూ ఎంతో నవ్విస్తారని, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తన కెరీర్లో పెద్ద బ్రేక్ అవుతుందని, ఇక మీదట తను చేసే సినిమాలన్నీ అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరిస్తాయని సుహాస్ పేర్కొన్నారు. బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమాను బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు.
