సుహానా .. ఆ నవ్వుకు ఫిదా కాని వాళ్లు ఉంటారా?
ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణితో సుహానా స్నేహం గురించి తెలిసిందే. ఓర్రీ సెలబ్రిటీ కిడ్స్ అందరికీ క్లోజ్ ఫ్రెండ్. అతడితో స్టార్ కిడ్స్ సన్నిహిత ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.
By: Sivaji Kontham | 30 Oct 2025 9:49 PM ISTకింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ `ది ఆర్చీస్` వెబ్ సిరీస్ తో నటనారంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నటిగా ఇది తనకు ప్రాక్టికల్ సెషన్. ఇప్పుడు తన తండ్రి షారూఖ్ తో కలిసి `కింగ్` అనే చిత్రంలో నటిస్తోంది. సుహానా నటిస్తున్న తొలి ఫీచర్ ఫిలిం ఇది.
ఇంకా తన మొదటి సినిమా విడుదల కాకపోయినా సుహానా యూత్ లో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. తన తండ్రి నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీని ఏలడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలోని నటవారసురాళ్లందరితోను సుహానాకు మంచి సంబంధాలున్నాయి.
ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణితో సుహానా స్నేహం గురించి తెలిసిందే. ఓర్రీ సెలబ్రిటీ కిడ్స్ అందరికీ క్లోజ్ ఫ్రెండ్. అతడితో స్టార్ కిడ్స్ సన్నిహిత ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఓర్రీలోని ఫన్ యాంగిల్ మరోసారి నవ్విస్తోంది. అతడు ఒక అమ్మాయిలా వేషం కట్టాడు. విగ్గు ధరించి, డ్యాన్సర్ ని తలపించేలా ఒక ప్రత్యేకమైన డ్రెస్ ని తొడుక్కున్నాడు. అయితే అతడి వేషధారణ చూశాక సుహానా కూడా నవ్వు ఆపుకోలేకపోతోంది. సుహానా ఈ ఫ్రేమ్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. తన తండ్రిలానే అందమైన నవ్వుతో ఆకర్షిస్తోంది. సుహానా అందం ఆకర్షణ, అమాయకత్వం ప్రతిదీ నెటిజనుల్లో చర్చకు వస్తున్నాయి. ఈ నవతరం బ్యూటీ నటన ఎలా ఉంటుందో తెలియాలంటే, కింగ్ విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే.
