స్టార్ హీరో డాటర్ డెబ్యూకి ఎందుకన్ని చిక్కులు!
బాద్ షా షారుర్ ఖాన్ సహా ఆయన కుమార్తె సుహానాఖాన్ ప్రధాన పాత్రలో సుజోష్ గోశ్ దర్శకత్వంలో `కింగ్` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే
By: Srikanth Kontham | 15 Aug 2025 7:00 PM ISTబాద్ షా షారుర్ ఖాన్ సహా ఆయన కుమార్తె సుహానాఖాన్ ప్రధాన పాత్రలో సుజోష్ గోశ్ దర్శకత్వంలో `కింగ్` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ కు వెళ్లి నెలలు గడుస్తోంది. ఇదే ఏడాది అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేసారు. కానీ అనివార్య కారణాలతో వచ్చే ఏడాదికి వాయిదా వేస్తు న్నట్లు వినిపించింది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది కూడా రిలీజ్ కాదని తేలిపోయింది. 2027 ప్రధ మార్ధం లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. ఈ విషయాన్ని మేకర్స్ సన్నిహిత వర్గాల ధృవీక రించాయి.
అయితే ఏ కారణంగా వాయిదా వేస్తున్నారు? అన్నది మాత్రం బయటకు రాలేదు. దీంతో ఈ సినిమా విష యంలో తలెత్తిన ఇబ్బందులేంటో? అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. ఇదే సినిమాతో షారుక్ కుమార్తె సుహానా ఖాన్ ఎంట్రీ ఇస్తుంది. తొలుత సుహానా ప్రధాన పాత్రలోనే ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచా రంలోకి వచ్చింది. అటుపై తనయ కోసం షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ పోషిస్తున్నారన్న మరో ప్రచారం జరిగింది. చివరిగా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తోన్న చిత్రంగా వెలుగులోకి వచ్చింది.
అలా ఈ సినిమాపై తొలి నుంచి డైలమా నడుస్తోంది. అందుకు తగ్గట్టు వాయిదాల పర్వం ప్రాజెక్ట్ పై రకర కాల సందేహాలకు తావిచ్చినట్లు అయింది. స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని మేకర్స్ కూడా ఖండించలేదు. అదే సమయంలో 2026లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా మరోసారి 2027 కి వాయిదా పడటంతో బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం సుహానాఖాన్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తోంది. `ది గ్రే పార్టీ ఆఫ్ బ్లూ` సినిమాతో సుహానా యూ ట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అటుపై అదే వేదికపై `ది అర్చీస్` తో వెరోనికా పాత్రతో అల రించింది. ఈ రెండు పాత్రలు ఇచ్చిన నమ్మకంతో `కింగ్` తో లాంచ్ కి రెడీ అయింది. కానీ రిలీజ్ కోసం మరో ఏడాది కాలం పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి.
