Begin typing your search above and press return to search.

సింపుల్ లుక్స్‌తో సంథింగ్ సంథింగ్: కిల్ చేస్తున్న ఖాన్ డాటర్!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. మొదటి ప్రయత్నం `ది ఆర్చీస్` ఈ స్టార్ కిడ్ కి కేవలం ఒక ప్రాక్టీస్ లాంటిదేన‌ని చెప్పాలి.

By:  Sivaji Kontham   |   10 May 2026 7:00 AM IST
సింపుల్ లుక్స్‌తో సంథింగ్ సంథింగ్: కిల్ చేస్తున్న ఖాన్ డాటర్!
X

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. మొదటి ప్రయత్నం `ది ఆర్చీస్` ఈ స్టార్ కిడ్ కి కేవలం ఒక ప్రాక్టీస్ లాంటిదేన‌ని చెప్పాలి. ప్రస్తుతం సుహానా తన తండ్రి షారుఖ్ ఖాన్‌తో కలిసి `కింగ్` అనే గ్యాంగ్‌స్టర్ డ్రామాలో నటిస్తోంది. తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం రక్తి కట్టించనుందని సినీ వర్గాల సమాచారం. సుహానా తన నటనతో ఈ సినిమాలో తండ్రికి ధీటుగా నిలబడాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది.




తాజాగా సుహానా షేర్ చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. ఇందులో న‌ట‌వార‌సురాలు చాలా సింపుల్ లుక్స్‌తో కనిపిస్తున్నా.. కుర్రకారును మాత్రం తన వలపు బాణాలతో కిల్ చేస్తోంది. సుహానా సింప్లిసిటీని చూసి నెటిజన్లు `సంథింగ్ సంథింగ్` అంటూ గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ ఫోటోషూట్ వెనుక ఒక వ్యాపార పరమార్థం కూడా ఉంది. సుహానా ప్రస్తుతం ప్రఖ్యాత `రీబాక్` షూస్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఆ బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగానే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.




సుహానా ఖాన్‌కు ఇన్‌స్టాగ్రామ్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రేజ్‌ను ఖాన్ డాట‌ర్ తన ఆదాయ వనరుగా మార్చుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం... సుహానా ఒక్కో బ్రాండ్ కాంట్రాక్ట్ కోసం దాదాపు రూ. 3 కోట్ల‌ నుండి 5 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారానే లక్షలాది రూపాయల ఆదాయాన్ని అర్జిస్తూ.. తండ్రికి తగ్గ తనయగా ఆర్థికంగా కూడా దూసుకుపోతోంది.

షారుఖ్, సుహానా కాంబినేషన్‌లో వస్తున్న `కింగ్` సినిమా విషయానికి వస్తే... ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే లండన్ షెడ్యూల్ పూర్త‌యింది. ప్రస్తుతం ముంబైలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంకా రెండు నుండి మూడు భారీ షెడ్యూళ్లు పెండింగ్‌లో ఉన్నాయని.. వచ్చే ఏడాది (2027) వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సుహానా కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని భావిస్తున్నారు.

కింగ్ త‌ర్వాతా సుహానా ఖాన్ న‌టించే భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి చర్చలు సాగుతున్నాయి. ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలో మహిళా ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సౌత్ ఇండియా విషయానికి వస్తే.. ప్రస్తుతానికి సుహానా తెలుగు లేదా ఇతర దక్షిణాది యువ హీరోల సరసన నటించే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుతం కేవలం హిందీ చిత్ర పరిశ్రమపైనే దృష్టి సారిస్తోంది. అయితే సరైన కథ - భారీ ప్రాజెక్ట్ దొరికితే భవిష్యత్తులో సౌత్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలను కూడా తోసిపుచ్చలేము.