Begin typing your search above and press return to search.

చీరకట్టులో సుహానా అందాలు.. ఏముందిరా బయ్!

ఈ క్రమంలోనే ఇలా చీరకట్టులో అభిమానులను ఆకట్టుకుంటూ మరింత పాపులారిటీ తెచ్చుకుంటున్న భామలలో సుహానా ఖాన్ కూడా ఒకరు.

By:  Madhu Reddy   |   13 Oct 2025 4:35 PM IST
చీరకట్టులో సుహానా అందాలు.. ఏముందిరా బయ్!
X

ఫాలోవర్స్ లో పాపులారిటీ దక్కించుకోవాలి అంటే నిత్యం చిట్టి పొట్టి బట్టలు వేసి అందాలను ఎరగా వేయడమే కాదు.. చీరకట్టులో కూడా అందాలు వలకబోస్తూ ఆకట్టుకోవచ్చని ఈ మధ్యకాలంలో పలువురు భామలు నిరూపిస్తున్నారు. సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ చీరకట్టులో కూడా అందాలను చూపిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అసలే చీరకు ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. అలాంటిది తమ అభిమాన హీరోయిన్స్ ఇలా చీరకట్టులో కనిపిస్తే ఫ్యాన్స్ తట్టుకోగలరా? అమాంతం లైక్, షేర్ చేసేయరు.. ఇప్పుడు సరిగ్గా అలాగే చేస్తున్నారు కూడా.

ఈ క్రమంలోనే ఇలా చీరకట్టులో అభిమానులను ఆకట్టుకుంటూ మరింత పాపులారిటీ తెచ్చుకుంటున్న భామలలో సుహానా ఖాన్ కూడా ఒకరు. బాలీవుడ్ బాద్షాగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న షారుక్ ఖాన్ కూతురిగా తనకంటూ ఒక గుర్తింపును అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న సుహానా ఖాన్. అందులో భాగంగానే పర్పుల్ కలర్ చీరలో తన అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఎప్పుడు మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించే సుహానా ఖాన్ ఇలా సడన్గా చీరలో కనిపించేసరికి అభిమానులు సైతం ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. పక్కా హీరోయిన్ మెటీరియల్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సుహానా ఖాన్.. 2000 సంవత్సరంలో మే 22వ తేదీన ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ , నిర్మాత గౌరీ ఖాన్ దంపతులకు జన్మించింది. ఈమె సోదరుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు అబ్రామ్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఈమె తల్లిదండ్రులు ముస్లిం, హిందూ మతాలను అనుసరిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూల్ విద్యను అభ్యసించిన ఈమె.. ఆర్డింగ్లీ కళాశాల నుండి ఉన్నత పాఠశాలలో పట్టభద్రురాలయ్యింది. న్యూయార్క్ లోనే న్యూయార్క్ విశ్వవిద్యాలయం డిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదివింది. తండ్రి స్టార్డం కారణంగా పుట్టుకతోనే మీడియా దృష్టిని ఆకర్షించిన ఈమె.. 2018లో ఓగ్ ఇండియా కవర్ పేజి పై దర్శనమిచ్చింది.

అలాగే ది గ్రేట్ పార్ట్ ఆఫ్ బ్లూ అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా నటన రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు సౌందర్య సాధనాలు సంస్థ అయినా మేబెల్లైన్ న్యూయార్క్, రిలయన్స్ రిటైల్ కాస్మోటిక్ బ్రాండ్ టిరాకి బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టింది. ఖుషి కపూర్ నటించిన ది ఆర్చీస్ అనే సినిమా ద్వారా నటిగానే కాకుండా గాయకురాలిగా కూడా పనిచేసింది.మొత్తానికైతే తండ్రి బాటలోనే ఇప్పుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.