Begin typing your search above and press return to search.

SS5కి పాన్‌ వరల్డ్‌ ప్రచారం.. భలే ఉందే

తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన బుల్లి తెరపై సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.

By:  Ramesh Palla   |   29 Sept 2025 11:00 AM IST
SS5కి పాన్‌ వరల్డ్‌ ప్రచారం.. భలే ఉందే
X

తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన బుల్లి తెరపై సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. వెండి తెరపై హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు నాలుగు సినిమాలను హీరోగా చేసిన సుడిగాలి సుధీర్‌ కొత్త సినిమాకు చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. నాలుగు సినిమాలకు నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందించలేదు. దాంతో సుధీర్‌ మంచి కథ కోసం ఇన్నాళ్లు వెయిట్‌ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు సుధీర్ కొత్త సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్‌ అంటూ గుర్తింపు దక్కించుకున్న శివ చెర్రీ ఇప్పుడు ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. ఇండస్ట్రీలో పలువురు యంగ్‌ హీరోలకు పీఆర్‌గా వ్యవహరించిన శివ చెర్రీ ఇప్పుడు నిర్మాణంలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

శివ చెర్రీ నిర్మాణంలో సుడిగాలి సుధీర్‌

సుధీర్‌తో తాను నిర్మించబోతున్న సినిమాకు సంబంధించి శివ చెర్రీ అధికారికంగా ప్రకటన చేశాడు. ఇండస్ట్రీలో తనకు ఉన్న పరిచయాలు, మీడియాతో ఉన్న పరిచయాల కారణంగా శివ చెర్రీ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్‌ చేసే అవకాశం ఉందని ఇప్పటిన ఉంచే చర్చ మొదలైంది. శివ చెర్రీ, సుడిగాలి సుధీర్‌ కాంబో మూవీ అంటూ ఇప్పటికే ప్రముఖంగా చర్చ మొదలైంది. ముఖ్యంగా పోస్టర్‌లో చాలా భాషలకు చెందిన పదాలను చూసిన సినీ ప్రేమికులు సర్‌ప్రైజ్‌ అవుతున్నాయి. అంతే కాకుండా ఇదొక పాన్ వరల్డ్‌ మూవీ అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సుడిగాలి సుధీర్ 5వ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరిగే విధంగా పీఆర్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు షూటింగ్‌ ఎప్పుడూ, దర్శకుడు ఎవరూ అనేది మాత్రం టీం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌లో ఉంచింది.

కాలింగ్‌ సహస్త్ర తర్వాత సుధీర్‌

కాలింగ్ సహస్త్ర సినిమా తర్వాత సుధీర్‌ పూర్తిగా బుల్లి తెరకి పరిమితం అయ్యాడు. పలు షో ల్లో హోస్ట్‌గా కనిపిస్తున్న సుధీర్‌ మళ్లీ ఇన్నాళ్లకు హీరోగా నటించడం ద్వారా వార్తల్లో నిలిచాడు. బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో మంది సుధీర్‌ను విపరీతంగా అభిమానిస్తారు. అలాంటి వారు అంతా ఆయన నుంచి ఒక మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మీడియం బడ్జెట్‌ లేదా లో బడ్జెట్‌ సినిమాలు చేసిన సుధీర్‌ ఎట్టకేలకు ఒక భారీ బడ్జెట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఒక మంచి కథ, దర్శకుడు దొరికితే ఖచ్చితంగా సుధీర్ వెండి తెరపైనా తానేంటో నిరూపించుకోవడం ఖాయం అంటూ అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు. సుధీర్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. సుధీర్‌ ఈసారి బాక్సాఫీస్ వద్ద భారీగానే కొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

బుల్లి తెర నుంచి వెండి తెరకు సుడిగాలి

SS5 టైటిల్‌తో విడుదల చేసిన పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో చాలా మంది నెటిజన్స్ ఏంటా ఈ సినిమా టైటిల్‌ అని ఏఐ టూల్స్ ద్వారా ఈ పోస్టర్‌ను సెర్చ్‌ చేసిన సమయంలో 'హైలెస్సో' అనే టైటిల్‌ చూపిస్తుంది. ఇప్పటి వరకు కథ, దర్శకుడు ఫిక్స్ కానప్పటికీ ఎలా ఈ టైటిల్‌ను పెట్టారు అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. చేసిన విభిన్నమైన ప్రచారం కారణంగా సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. పాన్‌ ఇండియా మూవీ అంటే కామన్‌ అయింది, ఇప్పుడు పాన్‌ వరల్డ్‌ మూవీ అంటూ ప్రచారం చేయడం ద్వారా భలే ప్రచారం దక్కింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సుడిగాలి సుధీర్‌ ఈ సినిమాతో అయినా హీరోగా తన సత్తాను చాటేనా అనేది చూడాలి.