Begin typing your search above and press return to search.

సుధీర్ బాబుకే ఎందుకిలా..?

జటాధర రిజల్ట్ మిగతా వారికి ఎలా ఉన్నా కూడా సుధీర్ బాబు మీద చాలా ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. ఆడియన్స్ ఎంగేజ్ చేయడంలో సుధీర్ బాబు మళ్లీ మళ్లీ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   9 Nov 2025 11:06 AM IST
సుధీర్ బాబుకే ఎందుకిలా..?
X

ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు ఇంకా కెరీర్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడు. సినిమా పరంగా తన బెస్ట్ ఇస్తూ చెప్పాలంటే ఒళ్లు హూనం చేసుకుంటూ కష్టపడుతున్న సుధీర్ బాబు అందుకు తగ్గ రిజల్ట్ ని మాత్రం అందుకోలేకపోతున్నారు. దీనికి రీజన్స్ లేకపోలేదు. సుధీర్ బాబు తన ఎఫర్ట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడు. ఫిట్ నెస్ తో పాటు క్యారెక్టర్ కి తగినట్టుగా తనకు తాను రెడీ అవుతాడు. ప్రతి సినిమాకు సుధీర్ బాబు కష్టం ఒకటే కనిపిస్తుంది కానీ దానికి తగిన రిజల్ట్ మాత్రం రావట్లేదు.

సుధీర్ బాబు జటాధర..

సుధీర్ బాబు లేటెస్ట్ సినిమా జటాధర ఆయన ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తుండటంతో ఇది కూడా పాన్ ఇండియా బొమ్మ అనే రేంజ్ లో చెప్పుకున్నారు. తీరా సినిమా చూశాక ఆడియన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ అంతా కూడా ఒక రొటీన్ సబ్జెక్ట్ తీసుకుని కష్టపడ్డారని ఆడియన్స్ తన రెస్పాన్స్ ఇచ్చారు.

జటాధర రిజల్ట్ మిగతా వారికి ఎలా ఉన్నా కూడా సుధీర్ బాబు మీద చాలా ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. ఆడియన్స్ ఎంగేజ్ చేయడంలో సుధీర్ బాబు మళ్లీ మళ్లీ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఇంతకుముందు హరోంహర అనే సినిమా బాగుంది అన్న టాక్ వచ్చినా అది కూడా అంతంత మాత్రంగానే అనిపించుకుంది. సుధీర్ బాబు ప్రతి సినిమాకు తన ఇన్వాల్వ్ మెంట్ తో సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేస్తున్నా కూడా తనకు మాత్రం సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా మాత్రం పడట్లేదు.

నిమా మీద తన టైం అండ్ ఎఫర్ట్..

జటాధర సినిమాపై ముందు నుంచి ఆడియన్స్ పెద్దగా హోప్స్ పెట్టుకోలేదు. అరుంధతి ఫ్లేవర్ కనిపించడంతో పాటు ట్రైలర్ చూస్తేనే ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ కలగలేదు. అందుకే సినిమాను మెజారిటీ ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. కానీ సినిమా మీద తన టైం అండ్ ఎఫర్ట్ పెట్టిన సుధీర్ బాబు మాత్రం అసంతృప్తిగా ఉన్నాడు. సుధీర్ బాబు తన పంథా మార్చి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి సినిమాలు ఇప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అన్నది చూసి అలాంటి కథలతో వస్తే ఏమన్నా పని అవుతుంది అని చెప్పొచ్చు.

సుధీర్ బాబు మాత్రం రిజల్ట్ ఎలా ఉన్నా కూడా తను చేసే ప్రయత్నంలో మాత్రం లోపం ఉండదు అన్నట్టుగా పట్టు వదలని విక్రమార్కుడిలా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. జటాధర వచ్చింది రిజల్ట్ తేలిపోయింది.. సో సుధీర్ బాబు బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పాలి. మరి ఈ రిజల్ట్ తో సుధీర్ తన నెక్స్ట్ అటెంప్ట్ ఎలా చేస్తాడన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.