Begin typing your search above and press return to search.

ఫౌజీలో స్టార్ వారసుడు.. సూపర్ బజ్..!

ఇప్పటికే అడివి శేష్ గూఢచారి, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాల్లో దర్శన్ కనిపించాడు.

By:  Ramesh Palla   |   28 Oct 2025 2:54 PM IST
ఫౌజీలో స్టార్ వారసుడు.. సూపర్ బజ్..!
X

స్టార్ వారసులకు సినీ ఎంట్రీ అనేది చాలా ఈజీ.. ఐతే వాళ్లు హీరో అయ్యే దాకా వెయిట్ చేయించి తెరంగేట్రం చేయించడం అనేది ఒక లెక్క ఐతే అలా కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసి అలా చిన్నగా ఆడియన్స్ కు పరిచయం చేయడం మరో లెక్క అవుతుంది. స్టార్ హీరోల వారసులకు అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఐతే ఘట్టమనేని హీరో సుధీర్ బాబు తన తనయుడు దర్శన్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగిస్తున్నాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ సినిమా..

ఇప్పటికే అడివి శేష్ గూఢచారి, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాల్లో దర్శన్ కనిపించాడు. ఇప్పుడు ఒక క్రేజీ సినిమాలో కూడా దర్శన్ నటిస్తాడని తెలుస్తుంది. అది రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ సినిమా అని టాక్. హను రాఘవపూడి డైరెక్షన్ లో 1930 నేపథ్యంతో భారీ బడ్జెట్ సినిమాగా వస్తుంది ఫౌజీ. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన ఒక ప్రీ లుక్ అదిరిపోయింది.

ఫౌజీ సినిమాలో హీరో చిన్నప్పటి రోల్ ని సుధీర్ బాబు తనయుడు దర్శన్ కనిపిస్తాడట. ఓ విధంగా దర్శన్ కి ఇది గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఫౌజీ లాంటి సినిమా వల్ల పాన్ ఇండియా లెవెల్ లో ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. సుధీర్ వారసుడు స్క్రీన్ కి బాగా అలవాటు పడేందుకే ఎలాంటి రోల్ వచ్చినా సరే చేస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమాలో అతని లుక్స్ కి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు.

తనను తాను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కోసం..

ఇక ఫౌజీ లాంటి సినిమాలో ఎలాగు మంచి పవర్ ఫుల్ రోల్ తోనే కనిపిస్తాడు. ప్రభాస్ చిన్నప్పటి రోల్ కి దర్శన్ అని అనగానే సుధీర్ బాబు అభిమానులు కూడా దర్శన్ కి మంచి ఆఫర్ అంటూ డిస్కస్ చేస్తున్నారు. దర్శన్ కూడా తనను తాను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. సుధీర్ బాబు ఎలాగు డిఫరెంట్ సినిమాలతో వస్తున్నాడు. ఆయన నటించిన జటాధర నెక్స్ట్ రిలీజ్ అవుతుంది.

సుధీర్ బాబు వారసుడిని కూడా ఇలా సినిమాల్లోకే తెచ్చే ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అతన్ని సుపరిచితుడిని చేసి హీరోగా అప్పటికి అంతా సెట్ రైట్ చేయాలని చూస్తున్నారు. ప్రభాస్ ఫౌజీలో దర్శన్ ఛాన్స్ అతన్ని మరింత ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు.

సుధీర్ బాబు సపోర్ట్ తో దర్శన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఎలాగు మేనమామ ఆశీస్సులతో పాటు ఆయన ఇంటెన్స్ యాక్టింగ్ వారసత్వం తోఉడు వస్తుంది కాబట్టి దర్శన్ కచ్చితంగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాడని చెప్పొచ్చు.