సుధీర్ బాబు రాంబో లుక్.. మామూలుగా లేదు!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
By: M Prashanth | 1 Sept 2025 1:34 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. స్పెషల్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు మెప్పిస్తూనే ఉంటారు. తనదైన యాక్టింగ్, ఎమోషన్ తో ఆడియన్స్ తోపాటు అభిమానులను అలరిస్తుంటారు.
రీసెంట్ గా మా నాన్న సూపర్ హీరో మూవీతో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు సుధీర్ బాబు. తన నటనతో ఫిదా చేశారు. ఇప్పుడు మైథలాజికల్ థ్రిల్లర్ జటాధరలో యాక్ట్ చేస్తున్నారు. డివోషన్ థ్రిల్లర్ గా రానున్న మూవీతో త్వరలో రానున్నారు. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
అయితే సినిమా కోసం ఎంత కష్టపడే సుధీర్ బాబు.. రీసెంట్ గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. జిమ్ లో కసరత్తులు చేస్తున్న పిక్ ను షేర్ చేశారు. అందులో సుధీర్ బాబు.. కండలు తిరిగిన దేహంతో.. లాంగ్ హెయిర్ తో.. చిన్నపాటి గడ్డంతో కనిపించారు. సీరియస్ గా ట్రెడ్ మీల్ లో పరిగెత్తుతూ ఉన్నారు.
మాటల కంటే శక్తి బిగ్గరగా మాట్లాడుతుందంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు సుధీర్ బాబు లుక్ వైరల్ గా మారగా.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమా పట్ల డెడికేషన్ అంటే ఇదేనని చెబుతున్నారు. వేరే లెవెల్ లో ఆయన లుక్ ఉందని అంటున్నారు. సుధీర్ బాబు రాంబో లుక్ సూపర్బ్ అంటూ కొనియాడుతున్నారు.
అయితే సుధీర్ బాబు.. సర్వైకల్ థ్రిల్లర్ కోసమే జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ఎందుకంటే అనౌన్స్మెంట్ పోస్టర్ లో షర్ట్ లేకుండా సాలిడ్ ఫిజిక్ తో ఇంటెన్స్ లుక్ లో కనిపించారు సుధీర్ బాబు. తన ఫిజిక్ మార్చుకుంటూ కండలు తిరిగిన మాచో లుక్ లోకి మారినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
దీంతో ఇప్పుడు ఆ సినిమా కోసమే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను కంటెంట్ బేస్డ్ మూవీస్, భారీ స్థాయిలో సినిమాలు రూపొందించడంలో స్పెషల్ గా నిలిచిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇతర యాక్టర్స్ సహా మిగిలిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
