Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు 'జటాధర'.. సరైన పార్టీ సాంగ్ వచ్చేసింది!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేయ్ పిల్లోడా సాంగ్ వైరల్ గా మారింది. ఫుల్ జోష్ లో ఉన్న సాంగ్.. అందరినీ ఆకట్టుకుని నెట్టింట దూసుకుపోతోంది.

By:  M Prashanth   |   15 Oct 2025 12:55 PM IST
సుధీర్ బాబు జటాధర.. సరైన పార్టీ సాంగ్ వచ్చేసింది!
X

టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు ఇప్పుడు జటాధర మూవీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు కెరీర్ లో వైవిధ్యమైన కంటెంట్ తో అనేక సినిమాలు చేసి తన నటనతో మెప్పించారు. ఇప్పుడు డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న జటాధరతో నవంబర్ 7వ తేదీన వరల్డ్ వైడ్ గా సందడి చేయనున్నారు సుధీర్ బాబు.

అయితే జటాధర మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన కంటెంట్.. సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఇప్పటి వరకు వచ్చి అప్డేట్స్ అందరినీ ఆకట్టుకోగా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. సినిమా నుంచి వరుస అప్డేట్స్ ను విడుదల చేస్తున్నారు.

మ్యూజికల్ జర్నీలో భాగంగా రెండు సాంగ్స్ రిలీజ్ చెయ్యగా.. రీసెంట్ గా మూడో సాంగ్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేడిని పెంచండి.. ట్రెండ్ సెట్ చెయ్యి పిల్లోడాతో ఉత్సాహంగా ఉండటానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. పార్టీ సాంగ్ పేరుతో మూడో సింగిల్ ప్రోమో విడుదల చేయగా.. మ్యూజిక్ లవర్స్ తోపాటు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ ఫుల్ లిరికల్ సాంగ్ ను తీసుకొచ్చారు. "పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కోసం ట్రెండ్ సెట్ చేశాం. ట్రెండ్ సెట్ చేయ్ పిల్లోడా ఇప్పుడు అందుబాటులో ఉంది" అని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేయ్ పిల్లోడా సాంగ్ వైరల్ గా మారింది. ఫుల్ జోష్ లో ఉన్న సాంగ్.. అందరినీ ఆకట్టుకుని నెట్టింట దూసుకుపోతోంది.

బ్యాచిలర్ గా ఎన్నాళ్లింకా.. కిస్ కాచే పట్టరా.. చాలు ఇంకా సింగిల్ లైఫ్.. మింగిలౌదాం పదరా... అంటూ సాగుతున్న పాటలో ముద్దుగుమ్మ శ్రేయ శర్మ తన లుక్స్ తో అదరగొట్టారు. హుషారుగా ఉన్న మ్యూజిక్ కు హీట్ పుట్టించే రేంజ్ లో స్టెప్పులతో మైమరపించారు. సుధీర్ బాబు.. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్స్ లో అదిరిపోయారు. తన స్వాగ్ అండ్ స్టెప్పులతో అలరించారు.

ట్రెండ్ సెట్ చేయరా పిల్లోడా సాంగ్ కు గాను శ్రీ మణి అందించిన లిరిక్స్ ను రాయీస్ & జైన్ - సామ్ కంపోజ్ చేశారు. సింగర్స్ స్ఫూర్తి జితేందర్, రాజీవ్ రాజ్ తమ గాత్రంలో ప్రాణం పోశారు. ఓవరాల్ గా సాంగ్ అయితే సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయేలా ఉండనుందని అర్థమవుతోంది. మరి హిందీ, తెలుగు భాషల్లో మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న జటాధరలో మూడో సింగిల్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.