Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు 'జటాధర' ట్రైలర్.. ఇది ధన పిశాచి ఆట

గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ తో ట్రైలర్ స్టార్ట్ అవ్వగా.. బ్యాక్ గ్రౌండ్ లో ఆసక్తి రేపే డైలాగ్ వచ్చింది. పూర్వం ధనాన్ని భూమిలో దాచి పెట్టి మంత్రాలతో బంధనాలు వేసేవారు.

By:  M Prashanth   |   17 Oct 2025 5:02 PM IST
సుధీర్ బాబు జటాధర ట్రైలర్.. ఇది ధన పిశాచి ఆట
X

టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు ఎప్పుడు విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ జటాధరలో యాక్ట్ చేస్తున్నారు. థ్రిల్లర్ అంశాలతో.. డివోషనల్ టచ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, లుక్స్, సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఆడియన్స్ లో సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ జోష్ తో మేకర్స్.. ట్రైలర్ ను శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా సోషల్ మీడియాలో ట్రైలర్ ను రిలీజ్ చేయించారు మేకర్స్.

గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ తో ట్రైలర్ స్టార్ట్ అవ్వగా.. బ్యాక్ గ్రౌండ్ లో ఆసక్తి రేపే డైలాగ్ వచ్చింది. పూర్వం ధనాన్ని భూమిలో దాచి పెట్టి మంత్రాలతో బంధనాలు వేసేవారు. వాటిలో భయంకరమైనది పిశాచి బంధనం అంటూ బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను చూపించారు మేకర్స్. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి వస్తోంది.

ఆ తర్వాత సుధీర్ బాబు స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు. పారానార్మల్ కార్యకలాపాలను నమ్మని పారానార్మల్ పరిశోధకుడిగా కనిపించారు. ధన పిశాచి మేల్కొన్నాడని తెలుసుకుని ఆమెను ఆపడానికి మార్గాలు కనుగొనడం ప్రారంభిస్తారు. దెయ్యాలను వేటాడే హీరో.. అతడి చుట్టూ జరిగే ధన పిశాచి ఆట.. ఇదే మూవీగా తెలుస్తోంది.

అయితే సుధీర్ బాబు మరోసారి తన నటనతో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. శివుని త్రిశూలంతో నడిచేటప్పుడు భక్తుడిగా, ఆ తర్వాత స్టైలిష్ లుక్స్‌ తో ఆకట్టుకున్నారు. ట్రైలర్ చివరి సీన్ తో గూస్ బంప్స్ తెప్పించారు. సోనాక్షి సిన్హా.. జటాధర మూవీలో సరికొత్త పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ట్రైలర్‌ లోని గ్రాఫిక్స్, విజువల్స్ సూపర్‌ గా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సిల్వర్ స్క్రీన్ పై విజువల్ ఫీస్ట్ గా మూవీ ఉంటుందని అర్థమవుతోంది. రాజీవ్ రాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్ లా నిలిచేలా కనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్ కు కూడా ఆయన అందించిన నేపథ్య సంగీతం అదిరిపోయిందని చెప్పాలి.

నిర్మాతలు ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రేరణ అరోరా ఎక్కడా రాజీ పడకుండా సినిమా కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ మేకింగ్ అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి నవంబర్ 7వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పుడు ట్రైలర్ అంచనాలు పెంచుతూ దూసుకుపోతోంది. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.