Begin typing your search above and press return to search.

'జటాధర' ట్రైలర్ టాక్.. ఇది నిధి వేట కాదు, పిశాచి ఆట!

యంగ్ హీరో సుధీర్ బాబు తన జోనర్‌ను మార్చారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ఈసారి ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

By:  M Prashanth   |   5 Nov 2025 5:24 PM IST
జటాధర ట్రైలర్ టాక్.. ఇది నిధి వేట కాదు, పిశాచి ఆట!
X

యంగ్ హీరో సుధీర్ బాబు తన జోనర్‌ను మార్చారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ఈసారి ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'జటాధర' అనే టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం నుంచి, లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇది మామూలు దెయ్యాల కథలా కాకుండా, నిధి, బంధనాలు, పిశాచి చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఉండబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది.

పూర్వం ధనాన్ని భూమిలో దాచి పెట్టి మంత్రాలతో బంధనాలు వేసేవారు. వాటిలో భయంకరమైనది పిశాచి బంధనం.. అనే కాన్సెప్ట్ ను బాగా హైలెట్ చేశారు. కథలో లంకె బిందెలు, వాటికి కాపలాగా ఉండే 'ధన పిశాచి' కీలక అంశాలుగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ఈ ధన పిశాచిగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా విశ్వరూపం చూపించినట్లు తెలుస్తోంది. ఆమె లుక్స్, అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి.

ఇక హీరో సుధీర్ బాబు విషయానికొస్తే, ఆయన ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో కనిపిస్తున్నాడు. "మీలో ఎంతమంది దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు?" అనే డైలాగ్ కు కనిపిస్తే నమ్ముతాను అనే సమాధానంతో ఎంట్రీ ఇచ్చినా, ఆయనే ఆ పిశాచి బంధనాన్ని ఛేదించే పనిలో పడినట్లు తెలుస్తోంది. స్టైలిష్ లుక్స్‌తో పాటు, శివుని భక్తుడిగా, త్రిశూలంతో యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా సుధీర్ బాబు ఆకట్టుకున్నారు. ఒకవైపు హారర్ ఎలిమెంట్స్, మరోవైపు యాక్షన్ మధ్య ఆ పాత్ర బ్యాలెన్స్‌డ్‌గా ఉండబోతున్నట్లు ట్రైలర్ హింట్ ఇచ్చింది.

ట్రైలర్‌లో విజువల్స్, గ్రాఫిక్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా, సోనాక్షి సిన్హాకు సంబంధించిన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌లను భారీ స్థాయిలో చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. రాజీవ్ రాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్‌లోని థ్రిల్లింగ్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. ప్రతి ఫ్రేమ్‌కు ఆయన అందించిన సంగీతం అదిరిపోయింది.

దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ మేకింగ్ స్టైల్ ప్రామిసింగ్‌గా ఉంది. ఒక రెగ్యులర్ హారర్ కామెడీలా కాకుండా, ఇండియన్ మైథాలజీలోని లంకె బిందెలు, పిశాచి బంధనం లాంటి కాన్సెప్ట్‌ను తీసుకుని, దానికి గ్రాఫిక్స్‌ను జోడించి ఒక విజువల్ ఫీస్ట్‌లా సినిమాను తెరకెక్కించినట్లు అనిపిస్తోంది. దురాశ ఒక రాక్షసుడిని నిద్రలేపినప్పుడు.. అనే ట్యాగ్‌లైన్ కథలోని మెయిన్ కాన్సెప్ట్ క్యూరియసిటీని క్రియేట్ చేస్తోంది.

మొత్తం మీద, 'జటాధర' ట్రైలర్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రామిస్ చేస్తోంది. ఇది కేవలం భయపెట్టే సినిమా మాత్రమే కాదు, అంతకుమించిన ఒక ఫాంటసీ, యాక్షన్, థ్రిల్లర్‌గా ఉండబోతోందని చెబుతున్నారు. ఇక నవంబర్ 7న విడుదల కానున్న ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో, సుధీర్ బాబుకు ఈ కొత్త జానర్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.