సుధీర్ బాబు 'జటాధర'.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇప్పుడు జటాధర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 15 Sept 2025 11:52 AM ISTటాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇప్పుడు జటాధర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆ సూపర్ నేచురల్ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అందుకు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డివోషనల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఆ సినిమాతో హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు.
వెంకటేష్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్న జటాధర మూవీ.. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో రూపొందుతోంది. ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్షయ్ క్రేజీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.
అనుకున్నట్లు పోస్ట్ ప్రొడక్షన్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేస్తున్న మేకర్స్.. తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. నవంబర్ 7వ తేదీన జటాధర మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ పోస్ట్ చేయగా.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
జటాధరుడు అంటే శివుడు కాగా.. గ్లింప్స్ లో త్రిశూలాన్ని తొలుత చూపించారు. ఆ తర్వాత ఆ పరమశివుడు నడిచి వస్తున్నట్లు ఉంది. చివర్లో రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా విజువల్స్ తో కలిపి గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలను కూడా ఫుల్ గా రెట్టింపు చేస్తోంది.
కాగా.. సినిమా విషయానికొస్తే.. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు మేకర్స్. సుధీర్ బాబుతోపాటు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ వంటి ప్రముఖ నటీనటులు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే మేకర్స్ సినిమాలోని క్యాస్టింగ్ ను స్పెషల్ పోస్టర్స్ తో పరిచయం చేశారు. ఆ సమయంలో అవన్నీ సూపర్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. మూవీపై మంచి అంచనాలు కూడా క్రియేట్ చేశాయి. అభిమానులు, ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని అందించేలా రూపొందుతోందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
