Begin typing your search above and press return to search.

'𝐀' వచ్చిన జటాధార సెన్సార్‌ టాక్‌..!

గత ఏడాది, అంతకు ముందు ఏడాది రెండు సినిమాల చొప్పున విడుదల చేసిన సుధీర్ బాబు ఈసారి మాత్రం ఇప్పటి వరకు సినిమాతో రాలేదు.

By:  Ramesh Palla   |   31 Oct 2025 3:32 PM IST
𝐀 వచ్చిన జటాధార సెన్సార్‌ టాక్‌..!
X

హిట్‌ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సుధీర్‌ బాబు వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది, అంతకు ముందు ఏడాది రెండు సినిమాల చొప్పున విడుదల చేసిన సుధీర్ బాబు ఈసారి మాత్రం ఇప్పటి వరకు సినిమాతో రాలేదు. ఈసారి ఎంపిక చేసుకున్న ప్రాజెక్ట్‌ వెయిట్‌ ఎక్కువ కావడంతో పాటు, అంచనాలు భారీగా ఉన్న కారణంగా కాస్త ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు జటాధార సినిమాతో సుధీర్‌ బాబు ఈ ఏడాదిలోనే నవంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్‌ అయింది. సుధీర్ బాబు హీరోగా జటాధార సినిమా ప్రారంభించినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను దర్శకుడు అభిషేక్ జైస్వాల్‌ రూపొందించాడు. హిందీలోనూ సుధీర్‌ బాబుకు గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుతో ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేశారు.




సుధీర్‌ బాబు 'జటాధార' సెన్సార్‌ రిపోర్ట్‌

సుధీర్‌ బాబు మాత్రమే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా నటించడంతో హిందీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. సోనాక్షి సిన్హా పాత్ర విషయంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. సోనాక్షిని ముందు పెట్టి సినిమాను పబ్లిసిటీ చేయడం కోసం మేకర్స్ ప్లాన్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా రూ.6 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసిందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక బాలీవుడ్‌లోనూ ఈ సినిమాకు మంచి డిమాండ్‌ ఉందని, మినిమం ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు బాక్సాఫీస్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో సినిమాను సెన్సార్‌ బోర్డ్‌ ముందుకు తీసుకు వెళ్లడం జరిగింది. సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ నుంచి 𝐀 సర్టిఫికెట్‌ రావడం జరిగింది. యూనిట్‌ సభ్యులు దీన్ని ముందుగానే ఊహించారట.

సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా తెలుగు సినిమా...

సినిమాలో అతిహింసతో పాటు, కొన్ని డైలాగ్స్‌, విజువల్స్‌ పెద్దలకు మాత్రమే అన్నట్లుగా ఉన్నాయని, అందుకే ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ వారు 𝐀 సర్టిఫికెట్‌ ఇచ్చారని తెలుస్తోంది. ఆ హింసాత్మక సన్నివేశాలను తొలగించే పరిస్థితి లేదు, అలాగే ఆ డైలాగ్స్ విషయంలోనూ మేకర్స్‌ తగ్గే పరిస్థితి లేదు కనుక 𝐀 సర్టిఫికెట్‌కి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పక్కా కమర్షియల్‌ సినిమాలు ఎక్కువగా 𝐀 సర్టిఫికెట్‌ను దక్కించుకుంటున్నాయి. పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ రారేమో అనే ఆందోళన కారణంగా చాలా మంది 𝐀 సర్టిఫికెట్‌ వద్దు అనుకుంటారు. కానీ ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌ వస్తారని, పిల్లలు లేకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంతో కనిపిస్తున్నారు. సినిమాలోని విజువల్స్‌, కథ, కథనం బాగున్నాయని సెన్సార్‌ బోర్డ్‌ సభ్యుల నుంచి ఇన్‌ సైడ్‌ టాక్‌ వినిపిస్తోంది.

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ జటాధార మూవీ

ఈ మధ్య కాలంలో వచ్చిన హర్రర్‌ సినిమాలు, పీరియాడిక్‌ సినిమాలకు ఏమాత్రం తీసి పోకుండా జటాధార సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. సుధీర్‌ బాబు కెరీర్‌ లో ఇది చాలా ప్రత్యేకమైన మూవీగా నిలుస్తుంది అంటున్నారు. అంతే కాకుండా హీరోయిన్‌ సోనాక్షి సిన్హాకు టాలీవుడ్‌లో ఒక మంచి ఆరంభం లభించినట్లు అవుతుందని, తెలుగులో సోనాక్షి గురించి ముందు ముందు ప్రేక్షకులు మాట్లాడుకోవడం మనం చూస్తామని కూడా మేకర్స్ చెబుతున్నారు. ఇక హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగానే ఈ సినిమాలోని సీన్స్ ఉంటాయని, తప్పకుండా ఉత్తరాది ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసంను మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్‌ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న సుధీర్‌ బాబుకు ఈ సినిమాతో అయినా సక్సెస్‌ దక్కేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.