Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో మరో ట్రెండ్.. ఆ లిస్ట్ లోకి సుధీర్ బాబు కూడా?

ఇప్పటికే విశ్వక్ సేన్ తన క్రియేటివ్ దృక్పథాన్ని డైరెక్ట‌ర్ గానూ చూపించగా, కిరణ్ అబ్బవరం కూడా స్వీయ దర్శకత్వంలో సినిమా చేసే దిశగా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే.

By:  Sravani Lakshmi Srungarapu   |   26 July 2026 1:36 PM IST
టాలీవుడ్‌లో మరో ట్రెండ్.. ఆ లిస్ట్ లోకి సుధీర్ బాబు కూడా?
X

టాలీవుడ్‌లో హీరోలు కేవలం యాక్టింగ్‌కే పరిమితం కావడం లేదు. కథల ఎంపిక నుంచి మేకింగ్ వరకు ప్రతి అంశంలో తమ ఆలోచనలను ప్రతిబింబించాలనే ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరోలే డైరెక్ట‌ర్లుగా మారే ధోరణి క్రమంగా బలపడుతోంది. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పుడా లిస్ట్‌లో సుధీర్ బాబు పేరు కూడా చేరనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్క‌ష‌న్ జరుగుతోంది.

సుధీర్ బాబు తన సొంత కథను తానే హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెట్ రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త టాలీవుడ్‌లో కొనసాగుతున్న కొత్త ట్రెండ్‌ను మరోసారి హైలైట్ చేస్తోంది. గతంలో డైరెక్ష‌న్ అంటే పూర్తిగా వేరే విభాగంగా భావించేవారు. కానీ ఇప్పుడు కథపై స్పష్టమైన అవగాహన, సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, సినిమా నిర్మాణ ప్రక్రియలో ఎక్స్‌పీరియెన్స్ కారణంగా పలువురు నటులు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టేందుకు ముందుకొస్తున్నారు.

ఇప్పటికే విశ్వక్ సేన్ తన క్రియేటివ్ దృక్పథాన్ని డైరెక్ట‌ర్ గానూ చూపించగా, కిరణ్ అబ్బవరం కూడా స్వీయ దర్శకత్వంలో సినిమా చేసే దిశగా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. మరోవైపు రామ్ పోతినేని కూడా ఇప్ప‌టికే త‌న డైరెక్ష‌న్ లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సుధీర్ బాబు కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటే, యంగ్ హీరోల్లో డైరెక్ట‌ర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ మార్పుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీ వేదికల విస్తరణతో కథకు ప్రాధాన్యం పెరగడం, కొత్త తరహా కథనాలను ఆడియ‌న్స్ ఎంక‌రేజ్ చేయ‌డం, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు మంచి ఆదరణ లభించడం వంటి అంశాలు హీరోల్లో కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి. డైరెక్ట‌ర్ విజన్‌పై మాత్రమే ఆధారపడకుండా, తమకు నచ్చిన కథను తమ ఆలోచనలకు అనుగుణంగా తెరకెక్కించాలనే ఆసక్తి కూడా పెరుగుతోంది. అదే సమయంలో డైరెక్ట‌ర్ గా మార‌డ‌మ‌నేది పెద్ద సవాలే. స్టోరీ, యాక్టింగ్, టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ స‌మ‌న్వ‌యం, నిర్మాణ బాధ్యతలు అన్నీ ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే ఈ జ‌ర్నీ కేవలం ఆసక్తితో కాకుండా, స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది.

సుధీర్ బాబు డైరెక్ష‌న్ లోకి అడుగుపెడితే అది కేవలం మరో సినిమా ప్రారంభం మాత్రమే కాకుండా, టాలీవుడ్‌లో హీరోలు తమ క్రియేటివిటీ పరిధిని విస్తరించుకుంటున్న కొత్త దశకు మరో ఉదాహరణగా నిలిచే అవకాశం ఉంది. కథ చెప్పడంలో నటులు కూడా కొత్త బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారనే సంకేతంగా ఈ పరిణామాన్ని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.