అందుకే సత్యం సుందరం మూవీకి కలెక్షన్లు రాలేదు..
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు.. మహేష్ బాబు బావ అయినటువంటి సుధీర్ బాబుకి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో రాణించలేకపోతున్నాడు.
By: Madhu Reddy | 3 Nov 2025 7:57 PM ISTసూపర్ స్టార్ కృష్ణ అల్లుడు.. మహేష్ బాబు బావ అయినటువంటి సుధీర్ బాబుకి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో రాణించలేకపోతున్నాడు. అయితే వరుస అవకాశాలు వచ్చినప్పటికీ ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. దాంతో ఆయన చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. మరి కథలు సరిగ్గా ఎంచుకోవడం లేదో ఏమో తెలియదు కానీ సినిమాలు మాత్రం అంతగా హిట్ అవ్వడం లేదు.అయితే అలాంటి సుధీర్ బాబు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి జటాధర అనే సినిమాతో నవంబర్ 7న మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు కలెక్షన్లు ఎందుకు రావడం లేదు అనే విషయం గురించి మాట్లాడారు.
సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈరోజుల్లో సినిమాలు ఎక్కువగా చూడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
ఒకప్పుడు సినిమాలు ప్రేక్షకులకి మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చేవి.కానీ ఇప్పుడు కంటెంట్ ఉండే సినిమాలకే ప్రేక్షకులు వెళ్తున్నారు. ఎందుకంటే థియేటర్లోకి వెళ్లి సినిమా చూడాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. అలా అని కంటెంట్ కారణంగానే సినిమాలకు వెళ్తున్నారు అని కూడా చెప్పలేం. ఎందుకంటే గతంలో ఫ్యామిలీ అందరూ కలిసి ఏదైనా ఎంజాయ్ చేయాలి అంటే మాక్సిమం అందరూ కలిసి ఓ సినిమా చూసేవారు. కానీ ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే పెరిగిన ధరల కారణంగా ఫ్యామిలీతో కలిసి సినిమా చూడడానికి ఎవరు ఇష్టపడడం లేదు.
ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి రెస్టారెంట్లకు వెళ్లి భోజనాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ వంటివి ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న క్రికెట్ సెటప్ వేసుకొని అందరూ ఒకే దగ్గర కూడా ఆడుకోవచ్చు. అలా ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉండటం వల్ల కూడా ప్రేక్షకులు సినిమాలు చూడడం తగ్గించేశారు. ఒకప్పుడు థియేటర్లో సినిమాలు చూడాలని ఒక్కసారైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునేవారు. కానీ ఇప్పుడు జనాల ఆలోచన మారిపోయింది. అందుకే సినిమాలకు కలెక్షన్లు రాకపోవడానికి కారణం సినిమా స్టోరీ అనేదే కాదు ప్రతి ఒక్కరికి భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి అంటూ సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.
అదే ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ఉదాహరణకి ఈ మధ్యకాలంలో విడుదలైన సత్యం సుందరం సినిమా విడుదలైనప్పుడు అంతగా ఏమీ లేదు. కానీ పోను పోను మౌత్ టాక్ కు వల్ల ఈ సినిమా ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ మంచి కలెక్షన్స్ సాధించింది అంటూ చెప్పారు. దీనికి సుధీర్ బాబు అది కూడా పాయింటే.. మౌత్ టాక్ వల్ల సినిమా హిట్ అయింది అనుకోవచ్చు. కానీ ఆ యాక్టర్స్ తో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి యునానిమస్ టాక్ వచ్చిన కూడా ఎందుకు ఈ సినిమా కలెక్షన్లు రాబట్ట లేకపోయింది.. కానీ ఖైదీ సినిమాలో నటించిన యాక్టరే ఇందులో కూడా నటించారు.
కానీ ఖైదీ సినిమాకి వచ్చినన్ని కలెక్షన్లు సత్యం సుందరం సినిమాకి ఎందుకు రాలేదు అన్నట్లుగా సుధీర్ బాబు మాట్లాడారు. దాంతో జర్నలిస్టు అది యాక్షన్ ఫిలిం కదా అందుకే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని సమాధానం ఇచ్చారు. అలా కంటెంట్ వల్ల మాత్రమే సినిమాలు ఫ్లాప్ అవ్వడం లేదని,ప్రేక్షకులకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉండడం వల్ల కూడా సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడం లేదు. అందుకే కలెక్షన్స్ తగ్గుతున్నాయి అన్నట్లుగా సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.
