గ్లామర్ ముసుగు దాటి: నవతరం నటీమణులకు అసలైన పాఠాలు?
డిజిటల్ యుగంలో మీ ప్రొఫైల్ మీ ఐడెంటిటీ. సాధారణ ఫోటో షూట్ తో సరిపెట్టకుండా? వైవిధ్యమైన పాత్రల్లో ఎలా నటించగలరో? చూపేలా బలమైన షోరీల్ రూపొందించుకోవడం ముఖ్యం.
By: Srikanth Kontham | 13 July 2026 10:00 PM ISTసినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రతి యువతి కల వెండితెరపై మెరవాలని, అభిమానుల గుండెల్లో నిలిచిపోవాలని ఉంటుంది. అయితే కెమెరా ముందు కనిపించే మెరుపు వెనుక ఎంతో కఠినమైన శ్రమ, ఓర్పు దాగి ఉంటాయి. నేటి తరం నటీమణులు లుక్స్ మీద ఆధారపడితే సరిపోదు. ప్రేక్షకులు అత్యంత తెలివైన వారు. వారు కేవలం అందాన్ని మాత్రమే కాదు. తెరపై పాత్రలో కనిపించే జీవాన్ని కోరుకుంటున్నారు. అందుకే నటిగా స్థిరపడాలంటే గ్లామర్ అంచనాలను దాటి కళాకారిణిగా ఎదగడం అన్నది అంతే అవసరం.
నటన అనేది ఓ విద్య లాంటిది. అది పుట్టుకతో వస్తుందని అనుకోవడం పొరపాటు. కొత్తగా వచ్చే నటీమణులు కచ్చితంగా నాటకరంగం లేదా ప్రొఫెషనల్ యాక్టింగ్ వర్క్‌షాప్‌ల ద్వారా నటనకు పదును పెట్టుకోవాలి. ఒక సన్నివేశంలో డైలాగ్ చెప్పడం వేరు. ఆ పాత్రలోని భావోద్వేగాన్ని ప్రేక్షకుడికి అనుభూతి చెందించడం వేరు. కళ్ళలో పలికే హావభావాలు, గొంతులో మార్పులు, బాడీ లాంగ్వేజ్ ఇవే సాధారణ నటీమణుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇదే నటనకు ఇచ్చే అసలైన ప్రామాణికత.
డిజిటల్ యుగంలో మీ ప్రొఫైల్ మీ ఐడెంటిటీ. సాధారణ ఫోటో షూట్ తో సరిపెట్టకుండా? వైవిధ్యమైన పాత్రల్లో ఎలా నటించగలరో? చూపేలా బలమైన షోరీల్ రూపొందించుకోవడం ముఖ్యం. ముఖ్యంగా చేసే ప్రతి చిన్న ఆడిషన్‌ను ఒక అవకాశంగా భావించాలి. ఆడిషన్ ఇచ్చేటప్పుడు ఆ పాత్రకు ఎంతవరకు సరిపోతారో? సిద్ధం కావాలి. ఆఫీసులు ..స్టూడియోల వంటి సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే కాస్టింగ్ చర్చలు జరపడం అనేది కెరీర్ ప్రారంభంలో తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన భద్రతా జాగ్రత్త.
పరిశ్రమలో నెట్‌వర్కింగ్ అంటే పార్టీలకు వెళ్లడం కాదు. పని పట్ల సీరియస్‌గా ఉండే దర్శకులు, రచయితలు, కాస్టింగ్ డైరెక్టర్లతో ఆరోగ్యకరమైన వృత్తిపరమైన సంబంధాలను పెంచుకోవడం. అలాగే అప్డేటెడ్ గా ఉండటం ఈ రోజుల్లో మస్ట్. వెబ్ సిరీస్, ఓటిటి, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ వంటివి కూడా మంచి ప్లాట్‌ఫారమ్‌లు. ప్రాంతీయ భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల మీద పట్టు సాధిస్తే పాన్-ఇండియా స్థాయికి చేరుకోవడం సులభం అవుతుంది.
కెరీర్ గ్రాఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు తిరస్కరణలు ఎదురు కావచ్చు. ఆ సమయంలో నిరాశ చెందకుండా? ఆ తిరస్కరణ ఎందుకు జరిగిందో విశ్లేషించుకోవాలి. పాత్ర నచ్చలేదా? నటనలో లోపాలు ఉన్నాయా? అని ప్రశ్నించుకుని మెరుగుపరుచుకోవాలి. ప్రతి విఫల ప్రయత్నం మరింత పరిణతి చెందిన నటిగా మారుస్తుంది. పట్టుదల ఉన్నవారికి పరిశ్రమలో అవకాశాల కొదవ లేదు.
అయితే ఈ ప్రయాణంలో వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. పరిశ్రమలో ఒత్తిళ్లు, పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ సహజత్వం, ఆత్మవిశ్వాసమే ఎవరినైనా? ప్రత్యేకంగా నిలబెడతాయి. ఎంచుకున్న లక్ష్యం వైపు ప్రయాణిం చేటప్పుడు నైతిక విలువలను పాటించాలి. ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉండాలి. సినిమా రంగం కేవలం కష్టపడే వారికే కాదు. ఎప్పుడూ నేర్చుకునే వారికి మాత్రమే నిలయం. ఇవన్నీ ఉంటే? విజయం వెతుక్కుంటూ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
