Begin typing your search above and press return to search.

ఐశ్వ‌ర్యా రాయ్ కి నో చెప్పిన డైరెక్ట‌ర్!

బాలీవుడ్ క్లాసిక్ చిత్రాల్లో 1999లో రిలీజ్ అయిన మ్యూజికల్ హిట్ `తాల్` ఒకటి. ఇందులో ఐశ్వర్యా రాయ్ పోషించిన మాన్సి పాత్ర ఆమె కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా నిలిచింది.

By:  Srikanth Kontham   |   30 Aug 2026 5:00 PM IST
ఐశ్వ‌ర్యా రాయ్ కి నో చెప్పిన డైరెక్ట‌ర్!
X

బాలీవుడ్ క్లాసిక్ చిత్రాల్లో 1999లో రిలీజ్ అయిన మ్యూజికల్ హిట్ `తాల్` ఒకటి. ఇందులో ఐశ్వర్యా రాయ్ పోషించిన మాన్సి పాత్ర ఆమె కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా నిలిచింది. అయితే ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్యను ఎంపిక చేయడానికి దర్శక-నిర్మాత సుభాష్ ఘై ప్రారంభంలో ఎంతో సంకోచించారని, అసలు ఆమెను తీసుకోవడానికి ఎంత మాత్రం సుముఖంగా లేరని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుభాష్ స్వ‌యంగా ఈ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసారు. `తాల్` చిత్రంలో ప్రధాన పాత్రకు నృత్యంలో మంచి ప్రవేశం ఉన్న నటి కావాలి అనుకున్నారు. దీంతో సుభాష్ ఘై దిగ్గజ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్‌ను సలహా కోరారు. మాధురీ దీక్షిత్ మినహా ప్రస్తుత కథానాయికలలో అద్భుతంగా డ్యాన్స్ చేయగలవారు ఎవరని అడగ్గా.. సరోజ్ ఖాన్ వెంటనే ఐశ్వర్యా రాయ్ పేరును ప్రతిపాదించారు. అయితే 1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న ఐశ్వర్య కేవలం మోడలింగ్, కాస్మొటిక్ ప్రపంచానికి చెందిన భామ మాత్రమేనని నటనకు పనికిరాదని సుభాష్ ఘై ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు.

మోడలింగ్ ఇమేజ్ ఉన్న నటి పల్లెటూరి అమ్మాయి మాన్సి పాత్రకు న్యాయం చేయలేదని సుభాష్ ఘై భావించారు. అయితే ఓ స్నేహితుడి స‌ల‌హాతో మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య నటించిన తమిళ చిత్రం `ఇరువర్` ప్రత్యేక ప్రదర్శనను చూడటంతో ఘై ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. `ఇరువర్` చిత్రంలో ఐశ్వర్య అద్భుతమైన నటనా నైపుణ్యాన్ని చూసిన తర్వాతే ఈ పాత్రకు తానే సరైన ఎంపిక అని సుభాష్ ఘై నిర్ణ‌యించుకున్నారు.

ఐశ్వర్యను ఎంపిక చేసిన తర్వాత ఆమెకు సుభాష్ ఘై ఓ నిబంధన పెట్టారు. సినిమా ప్రారంభంలో ఎలాంటి మేకప్ లేకుండా చాలా సాధారణంగా కనిపించాలని.. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఆమె పాత్ర గ్లామరస్ దివాగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఈ కండిషన్‌కు ఐశ్వర్య ఏమాత్రం సంకోచించకుండా ఒప్పుకోవడమే కాకుండా దర్శకుడి విజన్‌కు పూర్తి స్థాయిలో లొంగిపోయి పని చేశారు. ఐశ్వ‌ర్య ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి తాల్ అద్భుతంగా అభిన‌యించారు. ఆ విజ‌యం త‌ర్వాత ఐష్ కెరీర్లో వెన‌క్కి తిరిగి చూడలేదు.

తాల్ విష‌యంలోకి వె ళ్తే ద‌ర్శ‌కుడి పై పూర్తి నమ్మకంతో పనిచేసే నటీనటులు ఉన్నప్పుడే గొప్ప చిత్రాలు వస్తాయని ఈ సంద‌ర‌న్భంగా సుభాష్ ఘై ప్రశంసించారు. అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటులు కూడా దర్శకుడి ఆలోచనకే ప్రాధాన్యత ఇస్తారని `తాల్` విషయంలో ఐశ్వర్యా రాయ్, అనిల్ కపూర్, అక్షయ్ ఖన్నా ముగ్గురూ సెట్స్‌లో కష్టపడి పని చేశారని తెలిపారు. ఐశ్వర్య అంకితభావం, నటన పట్ల ఉన్న శ్రద్ధే `తాల్` విజయంలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు.