Begin typing your search above and press return to search.

కన్నడ సూపర్ హిట్ హారర్ మూవీ.. తెలుగు ట్రైలర్ చూశారా?

కొంతకాలంగా కన్నడ సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఓటీటీలో ఓ రేంజ్ లో సందడి చేస్తున్నాయి.

By:  M Prashanth   |   4 Aug 2025 8:18 PM IST
కన్నడ సూపర్ హిట్ హారర్ మూవీ.. తెలుగు ట్రైలర్ చూశారా?
X

కొంతకాలంగా కన్నడ సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఓటీటీలో ఓ రేంజ్ లో సందడి చేస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా అందరి ఆదరణ అందుకుంటన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన సు ఫ్రమ్ సో మూవీ.. తెలుగులో కూడా ఇప్పుడు రిలీజ్ కానుంది.

సోషల్ కామెడీ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమా.. ఎంటర్టైన్మెంట్ తో కన్నడ సినీ ప్రియులను బాగా మెప్పించింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా.. రూ.36 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు తెలుగులో ఆగస్టు 8వ తేదీన విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ గ్రాండ్ గా తెలుగు స్టేట్స్ లో విడుదల చేయనుంది.

ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. అతిపెద్ద నవ్వుల అల్లర్లు వేచి ఉన్నాయి.. సులోచన వేచి ఉందంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుని సందడి చేస్తోంది. సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది.

ట్రైలర్ ప్రకారం.. ఓ ఊరిలో అశోక్ అనే వ్యక్తి ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. అతనికి సులోచన అనే దెయ్యం పట్టిందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో గ్రామంలో కొన్ని ఘటనలు జరుగుతాయి. వాటి వెనుక కారణమేంటి? దెయ్యం పట్టడం నిజమేనా? చివరకు ఏమైందనేది మిగతా స్టోరీగా తెలుస్తోంది.

అయితే సినిమాలో లీడ్ రోల్ యాక్ట్ చేసిన జేపీ తుమినాడ్.. మూవీకి దర్శకత్వం కూడా వహించారు. స్టోరీ కూడా ఆయనే అందించారు. ప్రముఖ కన్నడ నటుడు కమ్ డైరెక్టర్ రాజ్ బి శెట్టి.. నిర్మాణంలో భాగస్వామిగా నిలిచారు. శశిధర్‌ శెట్టి బరోడా, రవిరాయ్‌ కలసతో కలిసి నిర్మించారు. షనీల్‌ గౌతమ్‌, సంద్య అరకెరె ప్రధాన పాత్రలు పోషించారు.

ఎస్. చంద్రశేఖరన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సుమేధా కె సాంగ్స్ అందించారు. సందీప్ తులసీదాస్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ సమకూర్చారు. ఆసక్తికరమైన కథ.. తెలుగు ప్రేక్షకులకు సినిమా నవ్వుల విందు అందించనుందని మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ హామీ ఇస్తున్నారు. మరి కన్నడలో విజయాన్ని సాధించిన ఫీల్ గుడ్ కామెడీ డ్రామా.. తెలుగులో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందా లేదో చూడాలి.