Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ కెరీర్‌లో సర్ప్రైజింగ్ ఛేంజ్!

లోకనాయకుడు కమల్ హాసన్ లైనప్‌లో కీలకమైన మార్పు చేసినట్లు తెలుస్తోంది. క‌మ‌ల్ తదుపరి ప్రాజెక్ట్‌ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

By:  Srikanth Kontham   |   27 July 2026 1:47 PM IST
కమల్ హాసన్ కెరీర్‌లో సర్ప్రైజింగ్ ఛేంజ్!
X

లోకనాయకుడు కమల్ హాసన్ లైనప్‌లో కీలకమైన మార్పు చేసినట్లు తెలుస్తోంది. క‌మ‌ల్ తదుపరి ప్రాజెక్ట్‌ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అనుకున్న దానికంటే ముందుగా మరో టాలెంటెడ్ డైరెక్టర్‌కు కమల్ అవకాశం ఇవ్వడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత నివేదికల ప్రకారం కమల్ హాసన్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ స్టంట్ మాస్టర్లు, దర్శకుల ద్వయం అయిన అన్బరివ్ దర్శకత్వంలో ప్రారంభిస్తారని అంతా భావించారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై ప్రేక్షకులలో ..సినీ వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ కొంతకాలం పాటు వాయిదా వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో `వీర ధీర సూరన్` వంటి చిత్రంతో ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ ప్రాజెక్ట్ అనూహ్యంగా ముందుకు వచ్చింది. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలందిస్తూ టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అరుణ్ కుమార్ దర్శకత్వంలోనే కమల్ హాసన్ తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ ప‌నులు శ‌ర‌ వేగంగా జ‌రుగుతున్నాయని స‌మాచారం.

అరుణ్ కుమార్ గతంలో 'సేతుపతి', 'చిత్త', 'వీర ధీర సూరన్' వంటి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన టేకింగ్, సహజమైన కథాకథనాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడితో జతకడుతుండటంతో ప్రాజెక్ట్పై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అయితే అన్బరివ్ దర్శకత్వంలో రావాల్సిన సినిమా పూర్తిగా రద్దయినట్లు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అరుణ్ కుమార్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. వీటితో పాటు కమల్ హాసన్ చేతిలో కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. `కల్కి పార్ట్ 2` చిత్రంలో క‌మ‌ల్ కీలక పాత్రలో నటిస్తుండగా, మ‌రో సీనియ‌ర్ దర్శకత్వంలో రానున్న కెహెచ్ - ఆర్కే ప్రాజెక్ట్ కోసం కూడా సిద్ధమవుతున్నారు. మొత్తానికి వయసుతో ప‌ని లేకుండా వరుస సినిమాలను అంగీకరిస్తూ నటుడిగానూ నిర్మాతగానూ దూసుకుపోతున్నారు.

ఈ షెడ్యూల్ మార్పుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వైవిధ్యమైన కంటెంట్‌ను తీసుకురావడానికి క‌మ‌ల్ సిద్ధమ వుతున్నారు. అనుభవజ్ఞుడైన నటుడు, ట్రెండింగ్ డైరెక్టర్ కలయికలో రాబోతున్న సినిమాలు టాలీవుడ్, కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.