Begin typing your search above and press return to search.

సినిమాల‌కు ఆవిడ ఐరెన్ లెగ్!

ఇండ‌స్ట్రీలో కొంత మంది భామ‌లు స‌క్సెస్ ల‌తో సంబంధం లేకుండా అవ‌కాశాలు ఒడిసి ప‌ట్టుకుంటారు.

By:  Srikanth Kontham   |   20 Aug 2025 10:21 AM IST
సినిమాల‌కు ఆవిడ ఐరెన్ లెగ్!
X

ఇండ‌స్ట్రీలో కొంత మంది భామ‌లు స‌క్సెస్ ల‌తో సంబంధం లేకుండా అవ‌కాశాలు ఒడిసి ప‌ట్టుకుంటారు. ఎన్ని ప్లాప్ లొచ్చినా? మాకు ఆ హీరోయిన్నే కావాల‌ని ప‌ని గ‌ట్టుకుని మ‌రీ ఎంపిక చేస్తుంటారు మేక‌ర్స్. ముంబై నుంచి ల్యాండ్ అయిన ఓ బ్యూటీ లైన‌ప్ చూస్తుంటే? ఇది నిజ‌మే అని మ‌రోసారి ప్రూవ్ అయింది. ఆ బ్యూటీ కెరీర్ తొలుత బాలీవుడ్ లో ప్రారంభించింది. అక్క‌డో రెండు సినిమాలు చేసింది. ఆ రెండు కూడా ప్లాప్ చిత్రాలే. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ లోనూ లాంచ్ అయింది. ఏడాదికో సినిమా చొప్పున రెండు సినిమాల్లో న‌టించింది.

అంచ‌నాలు భారీగా:

వాటిలో ఓ చిత్రం ఇటీవ‌లే రిలీజ్ అయింది. మ‌రి ఈ సినిమాలైనా హిట్ అయ్యాయా? అంటే మ‌ళ్లీ బాలీవుడ్ స‌న్నివేశ‌మే టాలీవుడ్ లోనూ రిపీట్ అయింది. మ‌రిప్పుడు చేతిలో అవ‌కాశాలున్నాయా? అంటే మ‌రెందుకు లేవు. రెడీగా రెండు సినిమాలున్నాయి. వాటిలో ఓ చిత్రం చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకురి రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇది ప‌ర‌భాషా చిత్ర‌మ‌నుకోండి. తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు అను వాద రూపంలో రాబోతుంది. మ‌రో సినిమా తెలుగు చిత్రం. ఇది ఆన్ సెట్స్ లో ఉంది. ఈ సినిమాపై మాత్రం అంచ‌నాలు బాగానే ఉన్నాయి.

వ‌రుస వైఫ‌ల్యాల‌తో:

కంటెంట్ ఉన్న చిత్రంగా మార్కెట్ లో బ‌లంగా టాక్ న‌డుస్తోంది. స‌ద‌రు బ్యూటీ కూడా ఈ చిత్రంపైనే ఆశ‌లు ఎక్కువ‌గా పెట్టుకున్న‌ట్లు వినిపిస్తుంది. ఈ సినిమాతోనై హిట్ అందుకుని రేసులో నిల‌వాల‌ని గంపెడు ఆశ‌ల‌తో ఎదురు చూస్తోంది. ఆ హీరో కూడా చాలా కాలంగా ప్లాప్ ల్లో ఉన్నాడు. అత‌డి ఆశ‌లు ఈ ప్రాజెక్ట్ పైనే. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. తెలుగులో రెండు.. .హిందీలో న‌టించిన రెండు సినిమాలు వ‌రుస‌గా ప్లాప్ అవ్వ‌డంతో? స‌ద‌రు బ్యూటీపై ఐరెన్ లెగ్ అనే ముద్రకు అతి ద‌గ్గ‌ర‌లో ఉంది.

స్క్రీన్ ప్ర‌జెన్స్ వీక్ గా:

తాజా సినిమాల‌తో హిట్ అందుకుని..ప్ర‌త్యేకించి తెలుగు సినిమాతో భారీ విజ‌యం అందుకుని ద‌రి చేరు తోన్న ఆ అప‌వాద‌ను దూరం చేయాలి? అనే ఆశ‌తో ఎదురు చూస్తోంది. మ‌రి అది జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది దైవేశ్చ‌. ట్యాలెంటెడ్ బ్యూటీ అయినా? అమ్మ‌డి స్క్రీన్ ప్ర‌జెన్స్ పై కూడా విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే అదేమీ పెద్ద స‌మ‌స్య కాదు. అందులో ఛాయాగ్రాహ‌కుడి త‌ప్పిదం కూడా క‌నిపిస్తోంది. కెమెరామెన్ యాంగిల్స్ లో వైఫ‌ల్యం క‌నిపిస్తుంది. అక్క‌డ స‌రిదిద్దుకుంటే స్క్రీన్ ప్ర‌జెన్స్ బెట‌ర్ గా ఉంటుంద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం.