Begin typing your search above and press return to search.

స్టార్ హీరోతో మూవీ.. హీరోయిన్ రోల్ వీక్ గా ఉండాల్సిందేనా?

స్టార్ హీరో సినిమా అంటే ఇంట్రో.. ఎలివేషన్ సీన్లు.. మాస్ డైలాగ్స్.. భారీ యాక్షన్. ఇవన్నీ ఎలా ఉండాలనే దానిపై దర్శకులు చాలా కసరత్తు చేస్తారు.

By:  M Prashanth   |   26 Sept 2026 4:00 AM IST
స్టార్ హీరోతో మూవీ.. హీరోయిన్ రోల్ వీక్ గా ఉండాల్సిందేనా?
X

స్టార్ హీరో సినిమా అంటే ఇంట్రో.. ఎలివేషన్ సీన్లు.. మాస్ డైలాగ్స్.. భారీ యాక్షన్. ఇవన్నీ ఎలా ఉండాలనే దానిపై దర్శకులు చాలా కసరత్తు చేస్తారు. కానీ అదే సినిమాలో హీరోయిన్ రోల్ దగ్గరకు వచ్చేసరికి కథలో ఆమెకు ఎంత అవసరం ఉందనే దానిపై అంతే కేర్ కనిపిస్తుందా అంటే సమాధానం ఎప్పుడూ క్లియర్ గా ఉండదు. ఇటీవలి సినిమాలతో ఆ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

అందుకు పెద్ది ఓ ఎగ్జాంపుల్. రామ్‌ చరణ్ రోల్ చుట్టూ స్టోరీ, స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్ తో మెయిన్ గా నడిచిన ఆ సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై ప్రేక్షకులు, రివ్యూలు భిన్నంగా స్పందించాయి. ఆమె రోల్ ను మరింత స్ట్రాంగ్ గా చూపించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ది ప్యారడైజ్ మూవీ పరిస్థితి మరింత ఇంట్రెస్టింగ్.

సినిమాలో కయాదు లోహర్ పోషించిన సుబ్బు రోల్ క్యారక్టరైజేషన్ పై విమర్శలు వచ్చాయి. హీరోయిన్ ట్రాక్ స్ట్రాంగ్ గా లేదని రివ్యూస్ వచ్చాయి. ఇక్కడే అసలు సమస్య కనిపిస్తుంది. హీరోయిన్‌ కు స్క్రీన్ టైమ్ ఎంతిచ్చారనేది మాత్రమే కాదు.. ఆ టైమ్ స్టోరీకి ఎంత యూజ్ అయిందనేదే మెయిన్. హీరోకు టార్గెట్ ఉంటుంది. దాన్ని సాధించేందుకు పోరాటం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎమోషనల్ క్లాష్ ఉంటుంది.

హీరోయిన్ మాత్రం హీరోతో ప్రేమలో పడటం, పాటల్లో కనిపించడం, కొన్ని కీలక సన్నివేశాల్లో అతనికి సపోర్ట్ చేయడంతోనే ఆగిపోతే ఆ రోల్ స్పెషాలిటీ తగ్గిపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, గేమ్ ఛేంజర్, రాజాసాబ్, అఖండ-2 వంటి స్టార్ హీరోల సినిమాల విషయంలోనూ ఇదే చర్చ జరిగింది. అయితే ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ వంటి కొన్ని సినిమాలు మాత్రం ఉమెన్ రోల్స్ ను సరిగ్గా చూపించాయి.

కల్కిలో సుమతి రోల్ కీలక పాత్రల్లో ఒకటి. ఆర్ఆర్ఆర్ లోనూ ఉమెన్ రోల్స్ కేవలం లవ్ యాంగిల్ కే పరిమితం కావు. అంటే భారీ కమర్షియల్ సినిమా అయినంత మాత్రాన వారి రోల్స్ కు స్ట్రాంగ్ ఆర్క్ రాయడం అసాధ్యం కాదు. ఇప్పటి ప్రేక్షకులు కూడా ఇదే తేడాను అబ్జర్వ్ చేస్తున్నారు. హీరోయిన్ గ్లామర్ ఎలా ఉందనే చర్చతో పాటు.. ఆ పాత్ర స్టోరీకి ఏం చేసిందనే ప్రశ్న వస్తోంది. హీరో ఇంట్రో కోసం ఒక సీన్‌ ను పదిసార్లు ఆలోచించే రేంజ్ లో.. హీరోయిన్ క్యారెక్టర్‌ కు కూడా ఒక స్ట్రాంగ్ మోటివేషన్ ఇస్తే స్టోరీలో ఛేంజ్ కనిపిస్తుంది.

ఆమె తీసుకునే డిసిషన్ హీరో జర్నీపై ఎఫెక్ట్ చూపించాలి. ఆమెకు ఎమోషనల్ వరల్డ్ ఉండాలి. హీరోతో సంబంధం లేకుండా కూడా ప్రేక్షకుడికి ఆ పాత్ర గుర్తుండాలి. అలా హీరో స్టార్ కావచ్చు.. స్టోరీ అతని చుట్టూ తిరగొచ్చు. కానీ హీరోయిన్ రోల్ మాత్రం కేవలం హీరోను ఎలివేట్ చేయడానికే ఉండాల్సిన అవసరం లేదు. చివరగా.. స్టార్ హీరో మూవీ అంటే హీరోయిన్ రోల్ వీక్‌ గా ఉండాల్సిందేనా అనేది ఇకపై డైరెక్టర్లు, రైటర్లు ఆలోచించాల్సిన పాయింట్.