Begin typing your search above and press return to search.

ఆ రెండు టైం వేస్ట్ ప‌నులేనా?

హిట్ అయితే బొమ్మ రెండో ఆట‌కు ఉంటుంది. లేక‌పోతే? కొన్ని థియేట‌ర్లో క్లియ‌ర్ అవుతుంది.

By:  Srikanth Kontham   |   4 Oct 2025 10:54 PM IST
ఆ రెండు టైం వేస్ట్ ప‌నులేనా?
X

సినిమా లో బ‌ల‌మైన కంటెంట్ ఉంటే నిడివితో ప‌నిలేకుండా ప్రేక్ష‌కులు ఆస్వాదిస్తున్నారు. అలాంటి కంటెంట్ లో పెద్ద పెద్ద స్టార్లు అవ‌స‌రం లేదు. గొప్ప టెక్నీషియ‌న్లు అవ‌స‌రం లేదు. ఉన్నంత‌లో సినిమాను ఎంత గొప్ప‌గా తీసారు? అందులో బ‌ల‌మెంత‌? అన్న‌ది మాత్రమే ప్రేక్ష‌కులు చూసి హిట్ ఇస్తున్నారు. అలా లేక‌పోతే అది ఎంత పెద్ద సినిమా అయినా రెండో షోకే తేలిపోతుంది. దీంతో సంబంధం లేకుండా ఈ మ‌ధ్య మేక‌ర్స్ కొత్త స్ట్రాట‌జీ అంటూ సీన్ లోకి వ‌స్తున్నారు. సినిమాలో మూడు గంట‌ల మించిన కంటెంట్ ఉంటే ఎడిటింగ్ లో లేపేస్తున్నారు.

క‌ట్ చేసిన కంటెంట్ మ‌ళ్లీ యాడింగ్:

అది స‌న్నివేశాలు కావొచ్చు..పాట‌లు కావొచ్చు లేదా? అన‌వ‌స‌రం అనుకున్న పాత్ర‌లు కావొచ్చు. అలా ట్రిమ్ చేసిన చిత్రాన్ని రెండున్న‌ర మూడు గంట‌ల నిడివితో రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా హిట్ అవుతుందా? పోతుందా? అన్న‌ది సంగ‌తి ప‌క్క‌న బెడితే? ఆ క‌ట్ చేసిన కంటెంట్ నే మ‌ళ్లీ యాడ్ చేస్తున్నారు. ఇదో ర‌క‌మైన స్ట్రాట‌జీగా కొంత మంది ద‌ర్శ‌కులు అనుస‌రిస్తున్నారు. కానీ దాని వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేద‌ని గ్ర‌హించింది ఎంత‌మంది? అవును. సినిమా తొలి షో ప‌డిన అనంత‌రం హిట్ ..ప‌ట్టా అన్న‌ది తేలిపోతుంది.

అతికించినా అతుకుల బొంత‌:

హిట్ అయితే బొమ్మ రెండో ఆట‌కు ఉంటుంది. లేక‌పోతే? కొన్ని థియేట‌ర్లో క్లియ‌ర్ అవుతుంది. అయినా రిజ‌ల్ట్ తో సంబంధం లేకుండా మేక‌ర్స ఎడిటింగ్ కంటెంట్ ని రిలీజ్ రెండు..మూడు రోజుల అనంత‌రం యాడ్ చేస్తున్నారు. దాని వ‌ల్ల ఏదైనా ఉప‌యోగం ఉందా? అంటే ఏం క‌నిపించ‌డం లేదు. అన‌వ‌స‌రంగా స‌మ‌యం వృద్దా చేసుకోవ‌డం త‌ప్ప. అవును హిట్ సినిమాను ఎలాగైనా జ‌నాలు థియేట‌ర్ కి వెళ్లి చూస్తారు. మ‌రి ప్లాప్ సినిమా ఎన్ని రిపేర్లు చేసినా థియేట‌ర్ కి వెళ్లి చూసేది ఎవ‌రు? అభిమానులు కూడా అలా వెళ్ల‌డం లేదిప్పుడు.

అభిమానుల్లో అవేర్ నెస్ :

ఒక‌ప్పుడు అంటే అభిమానులే సినిమాల్ని ద‌గ్గ‌రుండి మ‌రీ ఆడించే వారు. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు. ఏ హీరో అభిమాని కూడా అంత‌గా దృష్టి పెట్ట‌డం లేదు. అభిమానం పేరుతో జ‌రిగే దోపిడిని గ్ర‌హించే శ‌క్తి సామ‌ర్ధ్యాలు నేటి జ‌న‌రేష‌న్ యువ‌త పుష్క‌లంగా క‌లిగి ఉంది. మంచి చెడుల‌ను గ్ర‌హించ‌గ‌లుగుతున్నారు. సోష‌ల్ మీడియా యుగం లో వాస్త‌వాలు వేగంగానే బ‌య‌ట ప‌డుతున్నాయి. అలాంట‌ప్పుడు అభిమానం పేరుతో అన‌వ‌స‌రమైన దేనికని? అని త‌మ‌ని తామే ప్ర‌శ్నించుకుంటున్నారు.