800 కోట్ల బ్యూటీ క్రేజ్ ని ఇలా కూడా!
`స్త్రీ 2` ఏకంగా 800 కోట్ల వసూళ్లనే సాధించింది. ఈ నేపథ్యంలో మడూక్ ఫిల్మ్స్ కామెడీ యూనివర్శ్ లో భాగంగా `ఛోటా స్త్రీ` అనే యానిమేషన్ సినిమా ప్రకటించింది.
By: Srikanth Kontham | 29 Sept 2025 7:00 AM ISTఇండియాలో యానిమేషన్ చిత్రాలు ఎవరూ చూస్తారులే? అన్న భ్రమని `మహావతార్ నరసింహ` తుడిచి పెట్టేసిన సంగతి తెలిసిందే. నిజమే అప్పటి వరకూ యానిమేషన్ చిత్రాలకు ఇండియాలో అంతగా ఆదరణలేదు. అలాంటి సినిమాలు చేసినా వృద్ధా ప్రయత్నం తప్ప అంతకు మించి ఒరిగిందేమి లేదు. కానీ `మహావతార్ నరసింహ` తర్వాత ప్రేక్షకుల ఆలోచన ఎంతగా మారిందన్నది ఆ సినిమా ఫలితం చెప్పకనే చెప్పింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయినా ఈ చిత్రం పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
40 కోట్లలో నిర్మించిన సినిమా ఏకంగా 300 కోట్ల వసూళ్లను రాబట్టి ఓ చరిత్ర సృష్టించింది. ఓ యానిమేషన్ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు సాధిచిందింది అంటే ఇప్పటికీ నమ్మలేని పరిస్థితే. కానీ ఆడియన్స్ అభిరుచిలో ఎంతగా మార్పు వచ్చిందనడానికి ఈసినిమా విజయమే ఓ ఉదాహరణ. సరిగ్గా ఇదే స్ట్రాటజీని పట్టుకుని మడూక్ ఫిల్మ్స్ ఓ సినిమా చేస్తోంది. ఇక్కడ తెలివిగా బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకుంటుంది. `స్త్రీ `ప్రాంచైజీతో అమ్మడు బాలీవుడ్ లో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. `స్త్రీ `ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి.
`స్త్రీ 2` ఏకంగా 800 కోట్ల వసూళ్లనే సాధించింది. ఈ నేపథ్యంలో మడూక్ ఫిల్మ్స్ కామెడీ యూనివర్శ్ లో భాగంగా `ఛోటా స్త్రీ` అనే యానిమేషన్ సినిమా ప్రకటించింది. `స్త్రీ `ప్రాంచైజీలో శ్రద్దా కపూర్ పాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు. ఈ యానిమేటెడ్ సినిమా స్త్రీ పాత్ర నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చేలా తెరకెక్కుతుందని తెలిపారు. `స్త్రీ 3` విడుదలవ్వడానికి ఆరు నెలలు ముందుగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
మొత్తానికి బాలీవుడ్ లో శ్రద్దా కపూర్ ఇమేజ్..స్త్రీ అనే బ్రాండ్ ఇమేజ్ తో తెలివిగా సినిమాను జనాల్లోకి తీసుకొస్తున్నట్లు అర్దమైంది. కంటెంట్ ఉన్న యానిమేషన్ సినిమాలు అక్కడ బాగానే కనెక్ట్ అవుతాయి. కానీ తెలుగు మార్కెట్ లో ఛాన్స్ లేదు. `స్త్రీ `సినిమాను ఇక్కడా రిలీజ్ చేసి ఉంటే? ప్లాన్ వర్కౌట్ అయ్యేది . కానీ స్త్రీ ప్రాంచైజీ ని కేవలం బాలీవుడ్ కే పరిమితం చేసారు. `స్త్రీ 2` ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది కానీ ఆ ఛాన్స్ మడూక్ ఫిల్మ్స్ ఆ ఛాన్స్ తీసుకోలేదు.
