Begin typing your search above and press return to search.

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

మడాక్ ఫిలింస్ సొంత హీరోలకే కాకుండా ఇతర నటీనటులకు కూడా భారీ అవకాశాలు కల్పిస్తోంది. శ్రద్ధాకపూర్‌తో ‘స్త్రీ 3’, విక్కీ కౌశల్‌తో ‘మహావతార్’, అనీత్ పద్దాతో ‘శక్తి శాలిని’ చిత్రాలను నిర్మిస్తోంది. వీటి కోసం వరుసగా రూ.100-150 కోట్లు, రూ.200 కోట్లు, రూ.40-60 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ‘ఈత’ సినిమా హక్కులను పీవీఆర్ రూ.80 కోట్లకు కొనుగోలు చేయడం సంస్థ బ్రాండ్‌కు ఉన్న మార్కెట్‌ను చూపిస్తోంది.

By:  Sivaji Kontham   |   9 Nov 2026 9:54 AM IST
వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ
X

సొంత హీరోల కోసం ఎంత పెట్టుబడి అయినా పెట్టేందుకు నిర్మాణ సంస్థ‌లు వెన‌కాడ‌వు. సొంత బ్యాన‌ర్.. బ‌డ్జెట్ కేటాయింపు.. కేవ‌లం స్వ‌లాభాల కోసం పెట్టుబ‌డి పెట్ట‌డం.. సొంత‌ బ్రాండ్ ని బిల్డ్ చేసుకోవ‌డం.. ఇలాంటి ఎత్తుగ‌డ‌ల‌తో టాలీవుడ్, బాలీవుడ్ లో చాలా నిర్మాణ సంస్థ‌లు న‌డుస్తున్నాయి. వంద‌ల కోట్ల బ‌డ్జెట్ల‌ను రిస్కు చేయాలంటే కేవ‌లం త‌న అనే భావనతోనే పాజిబుల్.

అయితే అందుకు భిన్నంగా ఆలోచిస్తోంది ఈ నిర్మాణ సంస్థ‌. త‌మ సొంత బ్యాన‌ర్ లో ఒక సినిమా హిట్టిచ్చిన బ‌య‌టి వ్య‌క్తుల‌కు కూడా ఈ నిర్మాణ సంస్థ భారీ అవ‌కాశాలు క‌ల్పిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తోంది. ఈ బ్యాన‌ర్ లోనే శ్ర‌ద్ధాక‌పూర్, విక్కీ కౌశ‌ల్ లాంటి స్టార్లు బాగా షైన్ అయ్యారు. మంచి విజ‌యాల్ని అందుకుంటున్నారు. అనీత్ పద్దా లాంటి కొత్త‌మ్మాయికి కూడా ఈ బ్యాన‌ర్ ఇప్పుడు వెన్నుద‌న్నుగా నిలుస్తోంది. ఆ ముగ్గురితో ఇప్పుడు ఈ సంస్థ నిర్మిస్తున్న సినిమాలు ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. వాటి కోసం వంద‌ల కోట్ల బ‌డ్జెట్ల‌ను ఖ‌ర్చు చేస్తోంది.

ఇంత‌కీ ఈ బ్యాన‌ర్ ఏది? అంటే.. ప్ర‌ఖ్యాత మ‌డాక్ ఫిలింస్. ఈ బాలీవుడ్ అగ్ర‌ నిర్మాణ సంస్థ శ్ర‌ద్ధాక‌పూర్ తో -`స్త్రీ 3`, విక్కీ కౌశ‌ల్‌తో - మ‌హావ‌తార్, అనీత్ పద్ధాతో- శ‌క్తి షాలిని వంటి చిత్రాల‌ను నిర్మిస్తూ, వారిపై వంద‌ల కోట్లు పెట్టుబ‌డి పెడుతోంది. శ్ర‌ద్ధాక‌పూర్ న‌టించిన‌ `ఈత` లాంటి భారీ చిత్రాన్ని కూడా ఈ సంస్థ‌ నిర్మించింది. ఈత విడుద‌ల హ‌క్కుల‌ను దాదాపు 80కోట్లు వెచ్చించి పీవీఆర్ కొనుగలు చేయ‌డానికి కార‌ణం - మ‌డాక్ ఫిలింస్ కి ఉన్న గుర్తింపు.

స్త్రీ 3, మ‌హావ‌తార్, శ‌క్తి షాలిని చిత్రాల కోసం మ‌డాక్ ఫిలింస్ భారీ పెట్టుబ‌డులు పెడుతోంది. హార‌ర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న స్త్రీ 3 కోసం ఏకంగా 100 నుంచి 150 కోట్లు ఖ‌ర్చు చేస్తుండ‌గా, ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం యుద్దాలు చేసిన మ‌హా పురాణ పురుషుడు ప‌ర‌శురాముడి క‌థ‌తో రూపొందుతున్న మ‌హావ‌తార్ కోసం ఏకంగా 200 కోట్ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేయ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు కొత్త‌మ్మాయి అనీత్ ప‌ద్దా న‌టించిన శ‌క్తి షాలిని కోసం మ‌డాక్ ఫిలింస్ 40 కోట్ల నుంచి 60 కోట్లు ఖ‌ర్చు చేస్తుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ప్ర‌తిభావంతుల‌ను ప్రోత్స‌హించేందుకు ఈ సంస్థ భారీ పెట్టుబ‌డుల‌ను రిస్క్ చేస్తోంద‌న‌డంలో సందేహం లేదు. అయితే మ‌డాక్ ఫిలింస్ బ్రాండ్ తో సినిమాల రిలీజ్ కి ముందే అద్భుత‌మైన ప్రీబిజినెస్ ని సాధిస్తుండ‌టం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అలాగే శ్ర‌ద్దాకపూర్ న‌టించిన ఈత చిత్రానికి మ‌డాక్ ఫిలింస్ దాదాపు 60 కోట్ల మేర బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేసింద‌ని తెలుస్తోంది. అయితే దీనికి పీవీఆర్ సంస్థ 80 కోట్లు చెల్లించి థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ ద్వారా భారీ మొత్తాల‌ను ఆర్జిస్తోంది. ఆస‌క్తిక‌రంగా మ‌డాక్ సంస్థ నిర్మిస్తున్న సినిమాల‌న్నిటినీ పాన్ ఇండియా స్థాయిలో బిజినెస్ సాగించి అద్భుత‌మైన లాభాల‌ను క‌ళ్ల‌జూస్తోంది.