స్ట్రేంజర్ థింగ్స్: 8 చిత్రాలు.. ఒక్కో ఎపిసోడ్ బడ్జెట్ ఎంతో తెలుసా?
అలా తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్న ఓ వెబ్ సిరీస్ కి ఐదో సీజన్ (ఆఖరి సీజన్) విడుదల కాబోతోంది. మరి ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏంటంటే స్ట్రేంజర్ థింగ్స్..
By: Madhu Reddy | 11 Oct 2025 11:45 AM ISTఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ని సంపాదించుకుంటున్నాయి. అలా కొన్ని వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్లో భారీ ఆదరణకు నోచుకున్నాక మళ్ళీ ఆ వెబ్ సిరీస్ లకు సంబంధించిన మరిన్ని సీజన్లను ఎపిసోడ్ ల రూపంలో విడుదల చేస్తూ ఉంటారు. అలా తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్న ఓ వెబ్ సిరీస్ కి ఐదో సీజన్ (ఆఖరి సీజన్) విడుదల కాబోతోంది. మరి ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏంటంటే స్ట్రేంజర్ థింగ్స్..
ఇప్పటికే నాలుగు సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని భారీ హిట్ అయినటువంటి స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుందట. మరి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 లో ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి? దాని బడ్జెట్ ఎంత? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిఎదురు చూస్తున్నటు వంటి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. హాలీవుడ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ఇప్పటికే నాలుగు సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా రాబోతున్న ఐదో సీజన్ నవంబర్ 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే త్వరలో స్ట్రీమింగ్ కాబోయే ఐదో సీజన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే.. ఐదో సీజన్ ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ లో ఏకంగా 8 ఎపిసోడ్ లు ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు ఒక్కొక్క ఎపిసోడ్ నిడివి ఏకంగా 90 నిమిషాల నుండి మొదలు దాదాపు 2గంటల వరకు ఉంటున్నట్టు తెలుస్తోంది.
అయితే ఒక వెబ్ సిరీస్ గంటకు మించి ఉండదు. అలాంటిది రెండు గంటల నిడివి ఉంటుంది అంటే నిజంగా ఓ సినిమా లాగే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్ చాలా వెరైటీగా సినిమాటిక్ స్టైల్ లో విజువల్ వండర్ సిరీస్ అని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.. అంతేకాదు ఈ సీజన్ కి సంబంధించిన ఎపిసోడ్ లకి సంబంధించిన బడ్జెట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సీజన్లోని ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా 4.50కోట్ల నుండి 5.50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది..అయితే ఒక్కో ఎపిసోడ్ కి ఇంత బడ్జెట్ అంటే నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే ఇప్పటివరకు ఇంత ఎక్కువ టైంతో,బడ్జెట్ తో వెబ్ సిరీస్ లు రాలేదు. కానీ ఇంత బడ్జెట్ తో ఇంత ఎక్కువ టైంతో వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి అంటే నిజంగా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అభిమానులను ఓ కొత్త లోకంలోకి తీసుకువెళ్తుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
స్ట్రేంజర్ థింగ్స్ మొదటి వ్యాల్యూమ్ నవంబర్ 26న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలా మొదటి నాలుగు ఎపిసోడ్ లు నవంబర్ 26నుండి స్ట్రీమింగ్ అవుతాయి.అలాగే ఆ తర్వాత వచ్చే మూడు ఎపిసోడ్లు డిసెంబర్ 25న స్ట్రీమింగ్ అవుతాయని, ఇక చివరిగా గ్రాండ్ ఫినాలే కి సంబంధించిన ఒకే ఒక్క ఎపిసోడ్ డిసెంబర్ 31న విడుదలవుతుందని తెలుస్తోంది. అయితే ఈ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 గురించి డఫర్ మాట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇలాంటి అత్యంత,అతిపెద్ద ప్రతిష్టాత్మక సీజన్ ని మీరు చూడలేదని, ఈ సీజన్ 8 బ్లాక్ బస్టర్ సినిమాల వంటిది" అంటూ చెప్పుకొచ్చారు. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
