స్ట్రేంజర్ థింగ్స్ 5 ట్రైలర్: అనుక్షణం ఉత్కంఠ.. గగుర్పొడిచే అంశాలతో..
ఈ ట్రైలర్ లో ముందుకు సాగుతున్న కొద్ది స్నేహితులు భయంకరమైన వెక్నాకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ఉంటారు.
By: Madhu Reddy | 31 Oct 2025 1:24 PM ISTచాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో మునపటి సీజన్ లోని సంఘటనల తర్వాత హాకిన్స్.. దాదాపు నిర్బంధంలోకి వెళ్ళాక ఎలెవన్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటి నుండి ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ ట్రైలర్ లో ముందుకు సాగుతున్న కొద్ది స్నేహితులు భయంకరమైన వెక్నాకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ఉంటారు.అలాగే మరోసారి విల్ ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. "విలియం నువ్వు నాకు చివరిసారిగా సహాయం చేయబోతున్నావు" అని క్లైమాక్స్ సీక్వెన్స్ లో వెక్నా ప్రకటిస్తుంది..
ఒకానొక సమయంలో స్టీవ్ హారింగ్టన్ డస్టిన్ తో భావోద్వేగ క్షణాన్ని పంచుకున్నట్టు కూడా ట్రైలర్ లో చూపించారు. అలాగే ఎలెవెన్ డేవిడ్ హార్బర్ జిమ్ హప్పర్ తో జత కడతారు.. ఈ ట్రైలర్ లో డెమో గార్గాన్స్ దాడిని ప్రారంభించడంతో స్నేహితులు తమ శత్రువులతో పోరాటానికి కష్టపడుతున్న సమయంలో యాక్షన్ మరింత తీవ్రతరం అవుతుంది.. అతను మన ప్రపంచాన్ని అంతం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మనం బాధల నుండి బయటపడే వరకు అతను ఆగడు అని నాన్సీ చెబుతుంది. ఇక ఈ ట్రైలర్ లో ప్రతి ఒక్క మలుపులో ప్రమాదం పొంచి ఉండడం ఆసక్తికరంగా ఉంది... అలా ప్రపంచాన్ని కాపాడడానికి వెక్నాతో ప్రధాన నటుల చివరి యుద్ధాన్ని ఈ ట్రైలర్లో మనకు చూపించారు.
ఈ ట్రైలర్ రాబోయే ప్రధాన యుద్ధాన్ని సూచించడంతో పాటు ఈ ట్రైలర్ లో భయంకరమైన ఐకానిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, భయంకరమైన విజువల్స్ తో ట్రైలర్ మొత్తం ఉద్రిక్తత ఏర్పడినట్లు ఉంది.. ప్రధాన నటులు వేర్వేరు మార్గాలను ఎంచుకోవడం ద్వారా వెక్నాతో యుద్ధానికి సిద్ధమవుతుండగా మరోవైపు వెక్నా చివరిసారిగా విల్ను తన ఆయుధంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది.. స్నేహితులు వెక్నా నుండి విల్ ప్రపంచాన్ని రక్షించగలుగుతారా అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ మొత్తం చూడాల్సిందే..
ఈ ట్రైలర్ స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ 5పై అంచనాలను మరింత పెంచింది. స్ట్రేంజర్ థింగ్స్ చివరి సీజన్ మొదటి వాల్యూం నవంబర్ 6న విడుదలవుతుంది.రెండో వాల్యూం క్రిస్మస్ సందర్భంగా ప్రీమియర్ అవుతుంది. మరియు ఈ సీజన్ ముగింపు చివరి వ్యాల్యూం డిసెంబర్ 31 విడుదలవుతుంది.
