కంటెంట్ ఈజ్ కింగ్.. స్టార్ పవర్ కు కాలం చెల్లిందా?
అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఒక్కటే కంటెంట్ ఈజ్ కింగ్. తాజాగా బాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ సినిమా ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
By: M Prashanth | 2 Feb 2026 12:10 PM ISTఒకప్పుడు సినిమా అంటే హీరో.. హీరో అంటే స్టార్.. స్టార్ పేరు వినిపించగానే థియేటర్ల ముందు క్యూ లైన్లు కనిపించేవి. కథ ఎలా ఉన్నా, పాటలు ఎలా ఉన్నా, స్టార్ ఇమేజ్ చాలు అనుకునే రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రేక్షకుల ఆలోచన మారింది. స్టార్ ఎవరు? కన్నా కథ ఏమిటి? క్యారెక్టర్ ఎంత బలంగా ఉంది? అన్నదే ఇప్పుడు మెయిన్.
అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఒక్కటే కంటెంట్ ఈజ్ కింగ్. తాజాగా బాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ సినిమా ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఆ సినిమాలో స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించారు. సోషల్ మీడియాలో కోట్లాది ఫాలోవర్స్ ఉన్న రణవీర్ తన రస్టిక్ లుక్, సీక్రెట్ ఏజెంట్ పాత్రతో ఆకట్టుకున్నా ప్రేక్షకుల చర్చ మాత్రం విలన్ పాత్రపై ఎక్కువగా సాగుతోంది.
విలన్ రెహమాన్ బలోచ్ పాత్రలో నటించిన అక్షయ్ ఖన్నా తన స్క్రీన్ ప్రెజెన్స్, విలనిజంతో అందరినీ మెస్మరైజ్ చేశారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఎప్పుడూ లైమ్ లైట్ కు దూరంగా ఉండే ఆయన.. ధురంధర్ లోని పాత్రతో మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో కూడా ఇప్పుడు రణవీర్ కంటే అక్షయ్ ఖన్నానే హైలైట్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
దాన్ని చూస్తుంటే ప్రేక్షకులు కేవలం స్టార్ ఇమేజ్ కు మాత్రమే పరిమితం కావడం లేదని స్పష్టమవుతోంది. పాత్రలో ఎంత డెప్త్ ఉంది? యాక్టింగ్ ఎంత న్యాచురల్ గా ఉంది? కథలో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంది? ఇవే ఇప్పుడు ప్రేక్షకులపై ఎఫెక్ట్ చూపిస్తున్న ఎలిమెంట్స్. అందుకే ఒకప్పుడు హీరో ఇమేజ్ కు భంగం కలుగుతుందేమోనని నెగిటివ్ రోల్స్ చేయడానికి వెనుకాడిన స్టార్స్.. ఇప్పుడు విలన్ పాత్రలకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
రోల్ కు మంచి ఇంపార్టెన్స్ ఉండి స్కోప్ ఉంటే హీరో, విలన్ అన్న తేడా లేకుండా నటించడానికి చాలా మంది సిద్ధమవుతున్నారు. కథ డిమాండ్ చేస్తే గ్రే షేడ్స్ కూడా అంగీకరిస్తున్నారు. లేటెస్ట్ జెనరేషన్ లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. కొందరు హీరోలు ప్రత్యక్షంగా విలన్ లుగా మారి ప్రయోగాలు చేస్తున్నారు. మరికొందరు సపోర్టింగ్ రోల్స్ లోనూ మెరుస్తున్నారు. ప్రేక్షకులు కూడా అలాంటి పాత్రలను స్వాగతిస్తున్నారు.
యాక్టింగ్ బాగుంటే చాలు.. ఎవరు స్టార్, ఎవరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న తేడా చూపడం లేదు. ఓటీటీలు, పాన్ ఇండియా సినిమాలు, కంటెంట్ బేస్డ్ కథలు పెరగడం కూడా మార్పుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. స్టార్ పవర్ ఒక్కటే సినిమాను నిలబెట్టే రోజులకు బ్రేక్ పడిందని అంటున్నారు. ఏదేమైనా ప్రేక్షకులు ఎప్పుడైనా తెలివైనవాళ్ళు. వాళ్లకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ తోపాటు స్ట్రాంగ్ స్టోరీ, గుర్తుండిపోయే పాత్రలు. అందుకే స్టార్ కంటే స్టోరీ గొప్పది.. ఇమేజ్ కంటే నటనే ముఖ్యమనే చెప్పాలి.
