కొత్తొక వింత.. పాతొక రొధ!
తెలుగు సినిమా ట్రెండ్ మారింది. ఒకప్పుడు కథ ఎలా ఉన్నా? హీరో ఇమేజ్ తో బొమ్మ బండిలాగించేసేది. హీరో కోసమైనా ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లేవారు
By: Srikanth Kontham | 24 Sept 2025 9:51 AM ISTతెలుగు సినిమా ట్రెండ్ మారింది. ఒకప్పుడు కథ ఎలా ఉన్నా? హీరో ఇమేజ్ తో బొమ్మ బండిలాగించేసేది. హీరో కోసమైనా ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కటౌట్ కంటే కంటెంట్ మాత్రమే కీలకం అంటున్నారు. ఆ కథలో ఎంత పెద్ద హీరో అయినా కథలో దమ్ము లేదంటే? బాక్సాఫీస్ వద్ద తేలిపోవాల్సిందే. ఓపెనింగ్స్ కూడా వీక్ గా మారుతున్నాయి. తొలి షో తో సినిమా బాగుందని టాక్ వస్తే తర్వాత షోకి జనాలు వెళ్తున్నారు. లేదంటే? డబ్బులు పోయినా? పర్వాలేదు ప్లాప్ సినిమా చూడటానికి మాత్రం అస్సలు అంగీకరించడం లేదు.
అనవసరంగా సమయం వృద్ధా చేసుకోవడం దేనికంటున్నారు. కనీసం టైంపాస్ గా కూడా సినిమాకి వెళ్దాం అనే మాట ఎవరి నోట వినిపించలేదు. పాత రోజుల్లో సమయం ఉందంటే? ప్లాప్ సినిమా అయినా రెండున్నర గంటలు కాలక్షేపం కోసమైనా థియేటర్ కు వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. పెరిగిన టిక్కెట్ ధరలు కూడా థియేటర్ వైపు వెళ్లకపోవడానికి మరో ప్రధాన కారణం. హిట్ అయిన సినిమాలన్నీ కొత్త కథలు కాకపోయినా? ఆ కథల్ని దర్శకులు ఎలా ట్రీట్ చేస్తున్నారు? అన్నది ప్రేక్షకులు బలంగా స్టడీ చేస్తున్నారు.
ట్రీట్ మెంట్ బాగుంటే పాత కథైనా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి కథల్లో స్టార్ హీరోలు నటించ కపోయినా పర్వాలేదు. కొత్త వాళ్లైనా? ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వాళ్లకు కొత్త కాన్సెప్ట్ లు దొరికా యంటే బాక్సాఫీస్ వద్ద మిరాకిల్స్ చేస్తున్నారు. ఊహించని వసూళ్లతో ఎవరీ స్టార్ అని అంతా వారి వైపే చూస్తు న్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు పరిశ్రమలో కూడా ఈ తరహా చిత్రాలు ఎక్కువ రావడం విశేషం.ఈ ఏడాది స్టార్ హీరోల చిత్రాలెన్నో విడుదలయ్యాయి. కానీ వీటికన్నా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నది యువ నటుల చిత్రాలకే.
ఆ చిత్రాలన్నీ కేవలం కథా బలంతో మాత్రమే ఆడినవి. ఈ విషయంలో స్టార్ హీరోల నుంచి కూడా ఆ చిత్రాల టీమ్ కు మంచి అప్లాజ్ దొరుకుతుంది. నిర్మొహమాటంగా సోషల్ మీడియా వేదికగా స్టార్లు తమ అభిప్రాయాలను పంచు కుంటున్నారు. వివెస్ చెప్పడం..వీలైతే కొత్త అవకాశాలు కల్పించడం వంటివి చేస్తున్నారు. ఇండస్ట్రీకి ఆ మాత్రం సక్సెస్ రేట్ అయి కనిపిస్తుంది? అంటే అది కేవలం చిన్న సినిమాలతోనేనని ట్రేడ్ వర్గాల గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి.
