Begin typing your search above and press return to search.

కోలీవుడ్ స్టార్ కిడ్స్ డేరింగ్ స్టెప్.. టీనేజ్ లోనే ఇంత సాహసమా?

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   30 Sept 2025 6:00 PM IST
కోలీవుడ్ స్టార్ కిడ్స్ డేరింగ్ స్టెప్.. టీనేజ్ లోనే ఇంత సాహసమా?
X

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా రంగంలో సత్తా చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల మరాఠీ చైల్డ్ ఆర్టిస్ట్ త్రిష తోషర్ నాలుగేళ్ల వయసులోనే ఏకంగా నేషనల్ అవార్డు అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేని పిల్లలే కాదు సినీ సెలబ్రిటీల పిల్లలు కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తూ.. అందులో భాగంగానే డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు.

ఉదాహరణకు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ' ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్ చేసి భారీ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ కిడ్స్ వంతు వచ్చింది. వారిలో ప్రధమంగా చెప్పుకోవాల్సింది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. మొదట హీరోయిన్ గానే తన కెరీర్ ను ఆరంభించింది. కానీ సక్సెస్ కాలేదు. దాంతో టాలీవుడ్లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది.

ముఖ్యంగా ఎంతో స్టార్ హీరోలకు పోటీగా నటించి భారీ సక్సెస్ ను అందుకుంది. టాలీవుడ్ లో రమ్యకృష్ణ తర్వాత లేడీ విలన్ గా అంతటి స్థానాన్ని దక్కించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. అంతేకాదు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా పోషించింది. ఇప్పుడు ఈమె మరో డేరింగ్ స్టెప్ తీసుకుంది.తాజాగా "దోష డైరీస్" అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి.. 'సరస్వతి' అనే ఒక చిత్రాన్ని అనౌన్స్ చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతోంది.

ఇలా వరలక్ష్మి శరత్ కుమార్ 40 సంవత్సరాల వయసులో నిర్మాతగా యూటర్న్ తీసుకోవడం ఒక ఎత్తైతే.. ఇక్కడ టీనేజ్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధం అయిపోయింది మరో స్టార్ కిడ్. ఆమె ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూతురు దియా . అటు సూర్య ఇటు జ్యోతిక ఇద్దరు ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా, నిర్మాతలుగా చలామణి అవుతుంటే దియా మాత్రం వీరికి భిన్నంగా డైరెక్టర్గా అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఆమె 'లీడింగ్ లైట్' అనే డాక్యుమెంటరీ ఫిలిం తీసింది. 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య , జ్యోతిక నిర్మించారు. ముఖ్యంగా ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీ కోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో రీజెన్స్ థియేటర్లలో ప్రదర్శితం అవుతుంది . ఒకవేళ ఈ సినిమా గనుక ఆస్కార్ ఎంట్రీ పొందగలిగితే సూర్య కూతురు దియా డైరెక్టర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే అని చెప్పవచ్చు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సూర్య కూతురు దియా వయసు కేవలం 17 సంవత్సరాల మాత్రమే కావడం గమనార్హం.

ఏది ఏమైనా ఒకవైపు వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా మరొకవైపు సూర్య కూతురు దియా డైరెక్టర్ గా తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మరి ఈ స్టార్ కిడ్స్ డేరింగ్ స్టెప్ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.