Begin typing your search above and press return to search.

పెద్ద ఫ్యామిలీ హీరోల్లో నెక్స్ట్ జనరేషన్ టాప్ హీరో అయ్యేది ఎవరు?

స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చిన కొంతమంది నటులు వాళ్ళ టాలెంట్ ను చూపిస్తూ టాప్ హీరోలుగా ఎదుగుతున్నారు.

By:  Gopi Velupala   |   27 Sept 2026 11:00 AM IST
పెద్ద ఫ్యామిలీ హీరోల్లో నెక్స్ట్ జనరేషన్ టాప్ హీరో అయ్యేది ఎవరు?
X

స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చిన కొంతమంది నటులు వాళ్ళ టాలెంట్ ను చూపిస్తూ టాప్ హీరోలుగా ఎదుగుతున్నారు. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు స్టార్ హీరోల ఫ్యామిలీ ల నుంచి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు కొడుకు అయిన 'జయకృష్ణ' 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా అనుకున్న మేరకు ఆడకపోయిన కూడా జయకృష్ణ యాక్టింగ్ డాన్స్ ఫైటింగ్ సన్నివేశాల్లో తన ప్రతిభను చూపించాడు. దాంతో నటుడిగా తనకు మంచి ఫ్యూచర్ ఉందని సినిమాని చూసిన ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు...

ఇక ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా బాలయ్య బాబు కొడుకు 'మోక్షజ్ఞ ' సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. మరి బాలయ్య లెగసీ ని కంటిన్యూ చేస్తూ నందమూరి ఫ్యామిలీ బరువు బాధ్యతలను మోస్తు ముందుకు దూసుకెళ్తాడా లేదా అనేది తెలియాలంటే ఆయన మొదటి సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే...

నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ మనవడు జానకిరామ్ కొడుకు అయిన 'చిన్న ఎన్టీఆర్' సైతం ఇండస్ట్రీకి పరిచయం అవబోతున్నాడు. వచ్చే ఏడాది అతని సినిమా రానుంది. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించి నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా నందమూరి ఫ్యామిలీ 4వ తరం కూడా ఇండస్ట్రీకి రావడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు 'అకీరా నందన్' సైతం తొందర్లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే యాక్టింగ్ కి సంబంధించిన మెలుకువలను నేర్చుకుంటున్నాడు. తొందర్లోనే ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ లెగిసీ ని కంటిన్యూ చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తూ మెగా అభిమానులను ఆనంద పరచడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది...

సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు అయిన 'గౌతమ్ కృష్ణ' సైతం మరో రెండు సంవత్సరాలలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం 'వారణాసి' సినిమాతో బిజీగా ఉన్నాడు. అయినప్పటికి నమ్రత గౌతమ్ కృష్ణ యాక్టింగ్ కి సంబంధించిన పూర్తి పనులను తను చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా లెగసీ ని ముందుకు తీసుకెళ్లగలిగే కెపాసిటి గౌతమ్ కృష్ణకి ఉందని చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే 'వన్ నేనొక్కడినే' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన గౌతమ్ కృష్ణ ఆ సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు...

విక్టరీ వెంకటేష్ కొడుకు అయిన అర్జున్ సైతం ఇండస్ట్రీ లో తన హవాని చూపించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు... మరో 2 సంవత్సరాల్లో అర్జున్ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ స్టార్ హీరోగా మారాడు. రానా హీరోగా మారినప్పటికి వైవిద్య భరితమైన సినిమాలను చేస్తున్నాడనే పేరును సంపాదించుకున్నాడు తప్ప స్టార్ హీరో రేంజ్ కు తను వెళ్ళలేకపోయాడు. దాంతో ఇప్పుడు వెంకటేష్ కొడుకు మీదే దగ్గుబాటి ఫ్యామిలీ తో పాటు వాళ్ళ అభిమానులు సైతం భారీ ఆశలు పెట్టుకున్నారు...

వీళ్ళందరిలో ఎవరు టాప్ పొజిషన్ కి వెళ్తారంటే ఎవరైతే మంచి కథలను సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టి కష్టపడతారో వాళ్ళు మాత్రమే టాప్ హీరోగా మారుతారు. ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్తారు...