బ్రాండ్ ఇమేజ్ తో హైప్ మాత్రమే.. కానీ మూవీ నిలబడాలంటే?
సాధారణంగా ఏ సినిమా వెనుక అయిన బ్రాండ్ ఇమేజ్ ఉంటే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ రావడం సహజం. స్టార్ హీరో కొడుకు దర్శకుడిగా వస్తున్నా.. స్టార్ డైరెక్టర్ సినిమా సమర్పిస్తున్నా.. లేక నిర్మాతగా వ్యవహరిస్తున్నా అంచనాలు పెరుగుతాయి.
By: M Prashanth | 3 Oct 2026 3:40 PM ISTసాధారణంగా ఏ సినిమా వెనుక అయిన బ్రాండ్ ఇమేజ్ ఉంటే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ రావడం సహజం. స్టార్ హీరో కొడుకు దర్శకుడిగా వస్తున్నా.. స్టార్ డైరెక్టర్ సినిమా సమర్పిస్తున్నా.. లేక నిర్మాతగా వ్యవహరిస్తున్నా అంచనాలు పెరుగుతాయి. కానీ ఆ అంచనాలను నిలబెట్టేది మాత్రం కంటెంట్. రీసెంట్ గా వచ్చిన కొన్ని మూవీలు ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశాయి.
దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అయిన సినిమా సిగ్మా. విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల జేసన్ తొలి సినిమాపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుంది.. తన తండ్రి ఇమేజ్ కు భిన్నంగా ఏదైనా ఫ్రెష్ గా చూపిస్తారా అనే ఇంట్రెస్ట్ కూడా కనిపించింది. దీంతో సినిమా విడుదలకు ముందే డిబేట్ జరిగింది.
కానీ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన టాక్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోయింది. ఇక్కడే అసలు విషయం కనిపిస్తుంది. విజయ్ కొడుకు అనే గుర్తింపు సినిమాపై హైప్ పెంచొచ్చు. కానీ మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుడు ఆ గుర్తింపును పక్కన పెట్టి కథ, దర్శకత్వం, సినిమా టేకింగ్ గురించే మాట్లాడతాడు. పేరు సినిమాను పరిచయం చేయొచ్చు.. కానీ సినిమాను నిలబెట్టేది మాత్రం కంటెంట్.
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఫహద్ ఫాజిల్ నటించిన ఆసినిమాకు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాత. రాజమౌళి సమర్పకుడిగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కార్తికేయ నిర్మాతగా చేస్తున్న సినిమా కావడం.. రాజమౌళి పేరు కూడా ఉండటంతో సినిమా కచ్చితంగా ఏదో కొత్తగా ఉంటుందనే ఆసక్తి ఏర్పడింది. కానీ విడుదల తర్వాత వచ్చిన రెస్పాన్స్ మాత్రం నిరాశపరిచింది.
ఇక సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా వచ్చిన రోమాంచకం కూడా ఇదే చర్చకు కారణమైంది. ఆయన నిర్మాతగా ఉండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో దర్శకుడిగా ఆయన సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ కూడా దీనికి ఒక కారణం. కానీ అనుకున్న స్థాయిలో సినిమా రిజల్ట్ ఇవ్వలేదనే టాక్ వచ్చింది. దీంతో నిర్మాతగా కూడా స్టార్ డైరెక్టర్ ఉంటే అంచనాలు పెరుగుతాయని, కానీ ఆ అంచనాలను నిలబెట్టే బాధ్యత చివరకు సినిమా మీదే ఉంటుందని మరోసారి స్పష్టమైంది.
అయితే ఇలాంటి రిజల్ట్స్ వచ్చినంత మాత్రాన వారి సినీ జర్నీ ఆగిపోదు. సంజయ్ కు దర్శకుడిగా మరో అవకాశం రావచ్చు. కార్తికేయ నిర్మాతగా మరిన్ని సినిమాలు చేయొచ్చు. సందీప్ రెడ్డి వంగాకు కూడా మళ్లీ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒక్క సినిమా రిజల్ట్ కంటే తర్వాతి మూవీ ఏం చెబుతుందనేదే ముఖ్యం. అందుకే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, స్టార్ ఇమేజ్, బ్రాండ్ ఇవన్నీ హైప్ కు ఉపయోగపడతాయి. కానీ మూవీ నిలబడాలంటే మాత్రం ఆ బ్రాండ్ కంటే సినిమా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రేక్షకుడు చివరకు బ్రాండ్ చూడడు.. స్క్రీన్ పై సినిమా ఎలా ఉందో చూస్తాడు.
