ఆ స్టార్ హీరోయిన్ కి ఇక తెలుగులో అవకాశాలివ్వరా?
స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఓ భామ ఇప్పుడు తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. దీంతో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
By: Srikanth Kontham | 27 Sept 2025 8:15 AM ISTస్టార్ హీరోయిన్ గా వెలిగిన ఓ భామ ఇప్పుడు తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. దీంతో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవకాశాలు వచ్చినా తాను కమిట్ అవ్వడం లేదా? అవకాశాలు రాక సినిమాలు చేయడం లేదా? అన్న సందేహం చాలా కాలంగా ఉంది. కానీ ఆ నటికి ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు.. పరిచయాలు..స్నేహాలతో అవకాశాలు రాకపోవడం అంటూ ఏమీ ఉండదని ఓ వర్గం అప్పట్లో బలంగా వాధించింది.
కలరింగ్ కిల్ అయిందే:
సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరగలేదు గానీ...ఇన్ సైడ్ మాత్రం ఆమె మద్దతు దారులంతా అవకాశాలు లేకపోవడం ఏంటి? తానే కావాలనే నటించలేదని గట్టిగా వాదించారు. టాలీవుడ్ ని మించి తాను బాలీవుడ్లో సాధించాల్సింది చాలా ఉందని.. అక్కడ కెరీర్ కోసమే తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. అక్కడ అవకాశాలు వచ్చినప్పుడు తెలుగు సిపనిమాలు చేయాల్సిన అవసరం తనకేముందున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో తాను సాధించాల్సిందంతా సాధించేసిందని కొత్తగా ఇక్కడ చేయడానికి ఏముంది? అన్నట్లు కలరింగ్ ఇచ్చారు.
కొత్త నటి వైపు సంస్థలు:
కానీ అసలు సంగతేంటి? అన్నది ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. టాలీవుడ్ ఆమెని టార్గెట్ చేసి అవకాశాలు ఇవ్వ డం లేదన్నది అనుకుంటున్నారు. అవును ఈ విషయం కూడా ఆ స్టార్ హీరోయిన్ సన్నిహిత వర్గాల్లో చర్చకు దారి తీయడంతోనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నటి ప్రవర్తన కారణంగా తెలుగులో అవకాశాలివ్వడానికి అగ్ర బ్యాన ర్లు ఆలోచిస్తున్నాయనే చర్చ జరిగింది. స్టార్ హీరోలు కూడా చాలా మంది ఆమెతో ఇప్పటికే నటించడంతో? ఆమె కంటే మరో కొత్త నటి అయితే బాగుంటుందని నిర్మాణ సంస్థలకు సూచిస్తున్నారుట.
ప్రోత్సాహం కూడా లేదా:
వ్యక్తిగతంగా ఆమె జీవితంపై పడిన మచ్చ కూడా ఈ రకమైన దూరానాకి మరో కారణంగా మాట్లాడుకుంటున్నారు. ఆ నటిని తీసుకుంటే ఆమెపై ఉన్న చిన్నపాటి నెగివిటీ తమ సినిమాపై పడే అవకాశం లేకపోలేదని నిర్మాతలు గుస గుసలాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె తీరును దగ్గరగా చూస్తోన్న మరికొంత మంది కూడా తమ ఆలోచన మార్చుకుని కొత్త వారైతేనే ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నారుట. ఆమెతో తెలుగు ఆడియన్స్ కు ఉన్న ఎమోష నల్ కనెక్షన్ కూడా తెగిపోయిందంటున్నారు. అలాంటప్పుడు తనని ప్రోత్సహించడం అన్నది అర్దం లేనిదే అవుతుందంటున్నారు.
