హీరోలే విలన్లు ఇంకెన్ని మార్పులో!
పరిశ్రమ కథల ఎంపికలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు హీరో అంటే పవర్ ఫుల్ మాస్ యాక్షన్స్, సాంగ్స్, రొమాంటిక్ సీన్లకు మాత్రమే పరిమితమయ్యే వారు.
By: Srikanth Kontham | 2 Nov 2026 7:00 PM ISTపరిశ్రమ కథల ఎంపికలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు హీరో అంటే పవర్ ఫుల్ మాస్ యాక్షన్స్, సాంగ్స్, రొమాంటిక్ సీన్లకు మాత్రమే పరిమితమయ్యే వారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల రుచి మారుతున్న కొద్దీ స్టార్ హీరోలు కూడా ఇమేజ్ పట్ల సంకెళ్లను తెంచుకుంటున్నారు. పాజిటివ్ పాత్రలే కాకుండా కథ డిమాండ్ చేస్తే ప్రాణం పెట్టడానికి.. కఠినమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడానికైనా? ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ ట్రెండ్ ఇండియన్ సినిమాను ఓ కొత్త దిశలోకి తీసుకెళ్తోంది.
ఈ కోవలోనే టాలీవుడ్, శాండ్‌వుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అగ్ర హీరోలు విలన్ పాత్రల వైపు అడుగులు వేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే అక్కినేని నాగార్జున, రాకింగ్ స్టార్ యశ్, `ప్రేమలు` ఫేమ్ నస్లెన్ వంటి స్టార్లు నెగెటివ్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసారు. హీరోలుగా ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన వీరు విలనిజం పండించడంలోనూ ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. ప్రధాన పాత్రలకే పరిమితం కాకుండా కథలో డెప్త్ కోసం నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేయడానికి ముందుకొస్తుండటం విశేషం.
వారసత్వాలు, ఇమేజ్ హడావుడిని పక్కన పెట్టి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపు స్టార్స్ అడుగులు వేస్తుండటం ఇండస్ట్రీలో శుభపరిణామంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో ఈ స్టార్లు నెగిటివ్ పాత్రల పరంగా మరింతగా అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకట్రెండు ప్రయోగాత్మ చిత్రాలతో ఆగిపోకుండా దర్శకులు బలమైన విలన్ పాత్రలతో వస్తే నో చెప్పకుండా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
సినిమా చూసే విధానంలో ప్రేక్షకులు కూడా ఎంతో పరిణితి సాధించారు. హీరో గెలిస్తేనే సినిమా బాగుంటుందనే రోజులు పోయి విలన్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే సినిమా అంత గొప్పగా ఉంటుందనే అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చారు. ఈ మార్పును ముందుగానే గ్రహించిన స్టార్ హీరోలు ప్రతి నాయక పాత్రల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇది కమర్షియల్ సినిమాలకు ఓ సరికొత్త హంగును అద్దుతోంది.
ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ఈ పరిణామం రాబోయే రోజుల్లో మరింత ఊపందుకునే అవకాశం ఉంది. స్టార్ హీరోలు విలన్లుగా మారడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఓ వైపు హీరోల మాస్ ఇమేజ్.. మరో వైపు నెగెటివ్ షేడ్స్ లో క్రూరత్వం కలగలిసి తెరపై సరికొత్త మ్యాజిక్‌ను సృష్టిస్తున్నాయి. ఈ ప్రయోగాలు భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలకు పునాది వేయడంలో ఎలాంటి సందేహం లేదు.
