స్టార్ హీరోపై పొలిటీషన్ రాజకీయమా!
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య హెల్దీ వాతావరణం ఉంటుంది. పోటీ ఉన్నా హీరోలంతా ఒకరికొకరు సహకరించుకుంటారు.
By: Srikanth Kontham | 28 Aug 2025 5:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య హెల్దీ వాతావరణం ఉంటుంది. పోటీ ఉన్నా హీరోలంతా ఒకరికొకరు సహకరించుకుంటారు. కష్టకాలంలో కలిసి పని చేస్తుంటారు. సహాయక, సేవా కార్యక్రమాల్లో అంతా ఒకే తాటపై కొస్తారు. మనసులో ఎలాంటి భావాలున్నా? వాటన్నింటిని పక్కనబెట్టి పని చేస్తారు. ఐఖ్యత చూపి స్తారు. కలసి ఉంటే కలదు సుఖం అంటారు. కానీ అదే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సన్నివేశం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సినిమాలా? రాజకీయం ఉండదు. పీఠం కోసం కొట్లాటలు జరుగుతాయి.
ఎటాకింగ్ మొదలైందా:
వ్యూహాలు..ప్రతి వ్యూహాలు కనిపిస్తాయి. వెన్ను పోటులు ఎదురవుతాయి. ఇలా ఒకటేంటి? గెలుపు కోసం ఎలాంటి పరిస్థితులైనా రాజకీయాల్లో కనిపిస్తుంటాయి. పుట్టుక నుంచి రాజకీయాల్లో ఉంటే ఇది అలవాటైన పనే. కానీ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లినా? కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించే వారైనా? చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసికంగా మరింత ధృడంగా సిద్దమవ్వాలి. తాజాగా ఓ స్టార్ హీరో ఇటీవలే రాజకీయ పార్టీ స్థాపించి ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న నేపథ్యంలో? అతడిపై అధికార పార్టీ అప్పుడే ఎటా కింగ్ మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది.
అసలి సంగతి అదా:
ఇప్పటి వరకూ ఆ హీరో అంటే అభిమానించే నిర్మాతల్ని అతడిపై వ్యతిరేకద్యోమానికి తెర తీసే ప్రయ త్నా లు బ్యాకెండ్లో జోరుగా సాగుతున్నాయనే ఓ వార్త తెరపైకి వచ్చింది. పదేళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా గురించి ఇప్పుడా నిర్మాత మీడియా ముందుకొచ్చి ఆ హీరోపై చేసిన వ్యాఖ్యలు ఎన్నో సందేహాలకు తావి స్తున్నాయి. హీరో కారణంగా తాను నష్టపోయానని...కానీ ఆ హీరో పారితోషికం మాత్రం తన కారణంగా డబుల్ అయిందని పదేళ్ల క్రితం నాటి సినిమా గురించి మీడియాకి ఎక్కడం వెనుక అసలు వ్యక్తి వేరే ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చకొస్తుంది.
పంపిణి సంస్థను ఎరగా:
అలాంటి నిర్మాతల గ్రూప్ ని ఇండస్ట్రీలో ఇప్పటికే ఏర్పాటు చేసాడని..పంపిణి రగానికి సంబంధించి మరో ప్రత్యేక టీమ్ ని సిద్దం చేసాడన్నది మరో వెర్షన్. వీళ్లందరితో మూకుమ్మడి దాడికి రంగం సిద్దం చేయిస్తు న్నాడుట ఆ నటుడు కం పొలిటీషన్. ఆ స్టార్ కారణంగా నష్టపోయిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సహా అందర్నీ ఓటీమ్ లా ఏర్పాటు వ్యతిరేకతకు సన్నధం చేయిస్తున్నాడుట. అలాగే ఇండస్ట్రీలో తనకు అను కూలంగా ఉన్న హీరోలందర్నీ కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అందుకు తనకున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థను ఎరగా వేస్తున్నాడుట. ఇప్ప టికే ఆ ఉచ్చులో ఓ పెద్ద స్టార్ చిక్కుకున్నట్లు ఓ సందర్భంలో బయట పడిన సంగతి తెలిసిందే.
