కాన్సెప్ట్ బాగున్నప్పటికి సినిమాలు ప్లాప్ అవ్వడానికి కారణం ఏంటి..?
స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉంటాయి.
By: Tupaki Entertainment Desk | 21 Sept 2026 5:00 PM ISTస్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉంటాయి. కారణమేంటంటే వాళ్లు అంతకు ముందు చేసిన సినిమాలతో ప్రేక్షకుల్లో ఒక స్టాండర్డ్ ని క్రియేట్ చేసి పెట్టారు. పలానా హీరో సినిమా వస్తుందంటే చాలు అందులో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. లేదంటే డ్యాన్స్ లతో మన హీరో థియేటర్ మొత్తాన్ని ఉర్రూతలూగిస్తాడు. మన హీరో చేసే ఫైట్లకి ప్రేక్షకులందరిలో పూనకాలు వస్తాయంటూ అభిమానులు సంబరపడిపోతుంటారు. ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోలు మంచి కథలను సెలెక్ట్ చేసుకున్నప్పటికి అది సినిమాగా రూపాంతరం చెందడంలో మాత్రం ఎక్కడో కొన్ని తప్పులు జరుగుతున్నాయి దానివల్ల సినిమా అనుకున్న రేంజ్ లో ఆడటం లేదు... స్టార్ హీరోలు చేసే సినిమా కథలు బావుంటాయి. ఎందుకంటే కథల్లో వైవిధ్యం లేనిదే మన హీరోలు ఒప్పుకోరు. కాబట్టి వాళ్లు ఆ కథలో ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇక దర్శకులు సినిమాని చేసే క్రమంలో ఆ కంటెంట్ ను చెడగొడుతున్నారు. దాని వల్ల సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి అలాకాకుండా మంచి కథను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసిన సినిమాలు కూడా కొన్ని సందర్భాల్లో ఫ్లాప్ అవుతున్నాయి. కారణం ఏదైనా కూడా సినిమా రొటీన్ గా ఉంటే సక్సెస్ ఫుల్ టాక్ ను తెచ్చుకున్నప్పటికి ప్రేక్షకుడు ఆ మూవీ ని చూడడానికి పెద్దగా ఇష్టపడడం లేదు.
దానివల్ల సినిమాకి రావాల్సిన క్రేజ్ రావడం లేదు. ఫైనల్ గా సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అందుకే కొత్తదనాన్ని చూపించడానికి ప్రతి ఒక్కరు తీవ్రంగా శ్రమించాల్సిన అవసరమైతే ఉంది. కథ బాగుంటేనే సరిపోదు అన్ని క్రాఫ్ట్ ల వాళ్ళు వాళ్ల పూర్తి ఎఫర్ట్ పెట్టి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లినప్పుడే ఒక అద్భుతమైన ప్రాడక్ట్ బయటకు వస్తుంది. మరి అలాంటి సందర్భంలోనే మన స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు సైతం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నప్పటికి ఫైనల్ గా ఏదో ఒక రకంగా సినిమాలు అనుకున్న విధంగా ప్రేక్షకుడిని సంతృప్తి పరచడం లేదు.
అందువల్లే కొన్ని సినిమాలు అనుకున్న రేంజ్ లో విజయాలను సాధించలేక డీలా పడిపోతున్నాయి... ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ని సంపాదించుకుంటుందనే ఉద్దేశ్యంతోనే తెరకెక్కాయి. కానీ అందులో జరిగిన కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. కానీ కొన్ని సినిమాలు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ తో సూపర్ సక్సెస్ ని సాధించాయి...
