సూపర్‌స్టార్‌తో స్టార్ హీరోయిన్ల వైరం దేనికి?
అయితే అంత పెద్ద హీరో ఇద్దరు హీరోయిన్లతో తీవ్రంగా కలహించాడు. ఆ ఇద్దరు భామలు రకరకాల సందర్భాలలో అతడిపై విమర్శలు గుప్పించారు.
By: Sivaji Kontham | 11 Jan 2026 10:00 PM ISTఅతడు బహుభాషల్లో సూపర్ స్టార్‌గా వెలిగిపోతున్నాడు. తెలుగు, తమిళం, హిందీలో అతడు పెద్ద స్టార్. అప్పటికే ఇండస్ట్రీని ఏల్తున్న మూలస్థంభం లాంటి అగ్ర హీరోకి అల్లుడు (ఇటీవల మాజీ అయ్యాడు) అయినా కానీ, అతడు తన ప్రతిభను నమ్ముకుని ఎదిగాడు. నటుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, రచయితగా అతడి ప్రతిభకు గొప్ప గుర్తింపు దక్కింది.
అయితే అంత పెద్ద హీరో ఇద్దరు హీరోయిన్లతో తీవ్రంగా కలహించాడు. ఆ ఇద్దరు భామలు రకరకాల సందర్భాలలో అతడిపై విమర్శలు గుప్పించారు. తీవ్రంగా ఆరోపించారు. కోర్టుల పరిధిలో ఘర్షణ పడ్డారు. సదరు స్టార్ హీరో సెట్లో తాను చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. పీరియడ్స్ సమయంలో బాత్రూమ్ కి వెళ్లి బట్టలు మార్చుకోవడానిక అనుమతి కోరగా తిరస్కరించారని సదరు నటీమణి ఫిర్యాదు చేసింది.
ఆ సమయంలో ఫలానా స్టార్ హీరో సెట్లో ఇలా జరిగింది అంటూ మీడియా విపరీతమైన ప్రచారం చేసింది. దీంతో స్టార్ హీరో తప్పిదం కూడా ఉంది! అన్న అనుమానాలొచ్చాయి. షూటింగ్ సమయంలో ఒక రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు తాను పడ్డ ఇబ్బందిని సదరు నటీమణి వివరించారు. సముద్రం వద్ద లేదా నీటితో నిండిన ఒక సీన్‌లో ఆమె పూర్తిగా తడిసిపోవాల్సి వచ్చింది. ఆ సీన్ పూర్తయ్యాక ఒళ్లంతా నీటితో తడిసిపోయి ఉంది. దాంతో తనకు అసౌకర్యంగా ఉందని, బట్టలు మార్చుకోవడానికి హోటల్ గదికి వెళ్లాలని అడిగారు. కానీ అక్కడి సిబ్బంది అందుకు నిరాకరించారు. షూటింగ్ షెడ్యూల్ ఆలస్యమవుతుందనే కారణంతో ఆమెను అలాగే ఉండమన్నారు. ఆ సమయంలో తాను నెలసరి (పీరియడ్స్) లో ఉన్నానని, తడిసిన బట్టలతో గంటల తరబడి ఉండటం తనకు చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు. నేను హోటల్‌కు వెళ్లి బట్టలు మార్చుకోవాలి.. ఎందుకంటే నాకు పీరియడ్స్ వచ్చాయి! అని అందరి ముందు గట్టిగా అరవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఆ అరుపు విన్నాక అక్కడ ఉన్నవారంతా సైలెంట్ అయపోయారు .. అప్పుడు కానీ ఆమెను వెళ్లనివ్వలేదని గుర్తుచేసుకున్నారు.
ఆ రోజు షూటింగ్ సెట్‌లో తనతో కలిపి కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే ఉన్నారని ఆమె తెలిపారు. షూటింగ్ సెట్లలో మహిళలకు కనీస సౌకర్యాలు, భద్రత ఉండటం లేదనే విషయాన్ని ఈ ఘటన హైలైట్ చేసింది.
ఈ గొడవ ముగిసిన కొన్నేళ్లకు స్టార్ హీరోయిన్- డైరెక్టర్ (దంపతులు) జోడీ తెరకెక్కించిన డాక్యుమెంటరీ విషయంలోను సదరు సూపర్ స్టార్ కోర్టుకు ఎక్కడంతో చాలా పెద్ద గొడవే అయింది. డాక్యుమెంటరీ కోసం తనకు హక్కులు ఉన్న విజువల్ లేదా ఆడియోను ఉపయోగించుకోవడంపై కోర్టులో దావా వేసారు. ఈ కేసులో విచారణలు కొనసాగుతున్నాయి. పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగిన అతడు అనూహ్యంగా పెను వివాదాల్లోకి వచ్చాడు. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్లకు పెద్ద విరోధి అయ్యాడు.
