డైరెక్టర్ కే సవాల్ విసిరిన స్టార్ హీరో!
నువ్వెంతంటే నువ్వెంత ! అన్న సన్నివేశం ఎలాంటి సందర్భంలో తలెత్తుతందో చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 12 Aug 2025 12:00 AM ISTనువ్వెంతంటే నువ్వెంత ! అన్న సన్నివేశం ఎలాంటి సందర్భంలో తలెత్తుతందో చెప్పాల్సిన పనిలేదు. తగ్గాఫ్ వార్ తలెత్తినప్పుడు..ఈగో ప్యాక్టరీ అడ్డొచ్చినప్పుడు ఒకరికొకరు సై అంటూ సవాల్ విసురుకుంటారు. తాజాగా ఓ స్టార్ హీరో- స్టార్ డైరెక్టర్ మధ్య ఇలాంటి సన్నివేశం ఎదురైనట్లు వెలుగులోకి వచ్చింది. వివరా ల్లోకి వెళ్తే.. ఇటీవలే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఓ చిత్రం పట్టాలెక్కింది. అందులో ఓ పాన్ ఇండియా హీరో నటిస్తున్నాడు. డైరెక్టర్ కి పాన్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. అలా ఇద్దరికి పాన్ ఇండియా క్రేజ్ ఉండ టంతో? పాన్ వరల్డ్ కనెక్ట్ అవ్వాలని ఇరువురు కనెక్ట్ అయ్యారు.
అనూహ్యంగా ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. ప్రేక్షకులు ఏమాత్రం ఊహించలేదు. పెద్దగా సమయం కూడా తీసుకోకుండానే పట్టాలె క్కించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది. అయితే షూటింగ్ అనంతరం హోటల్ లో పార్టీ సమయంలో డైరెక్టర్ మనమెంత బాగా పనిచేస్తో అంత గొప్ప ఔట్ పుట్ వస్తుంది? వంద శాతం ఎఫెర్ట్ పెట్టి పనిచేద్దాం అన్నాడుట. దానికి ఆ హీరో కాస్త ఫీలైనట్లు సమాధానం ఇచ్చాడుట. నువ్వెంత బాగా రాస్తే తానంత గొప్పగా నటిస్తానని..తాను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పాడుట.
నాదేమీ లేదు అంతా నీ మీదనే ఉంది. కావాలంటే తన గత సినిమాలను దగ్గరగా పరిశీలించమని చెప్పాడుట. ఓ రకంగా డైరెక్టర్ కి సవాల్ విసిరినట్లే సమాధానం ఇచ్చాడుట ఆ హీరో. దీంతో సదరు డైరెక్టర్ చూద్దాం అన్నట్లు బధులిచ్చాడుట. ఇద్దరి మధ్య సరదాగా జరిగిన సంభాషణ మాత్రమే ఇది. ఇందులో ఎంత మాత్రం సీరియస్ నెస్ లేదని సమాచారం. షూటింగ్ మొదలైన తర్వాత డైరెక్టర్ హీరోకి మరింత క్లోజ్ అ్వడంతో ఇద్దరి మధ్య తలెత్తిన సరదా సంభాషణ ఇది.
ఎస్ ఎస్ ఎంబీ 29 తర్వాత ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న చిత్రమిది. భారీ బడ్జెట్ ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నిర్మాతల కెరీర్ లోనే అతి భారీ బడ్జెట్ చిత్రమిదే అవుతందని సమాచారం. షూటింగ్ తో పాటు, టెక్నికల్ పనులకు కోట్ల రూపాయలు వెచ్చించారు. ప్రఖ్యాత విదేశీ స్టూయోడి కంపెనీలెన్నో ఈసినిమా కోసం పని చేస్తున్నాయి.
