Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో ఒపీనియన్ ఏంటి? ఏం చేస్తారు?

నిజానికి ఆ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఇద్దరు ప్రముఖ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. కానీ ఆ సినిమాల్లో ఒకటి విడుదలకు ఇంకా లైన్ క్లియర్ చేసుకోలేకపోయింది.

By:  M Prashanth   |   15 March 2026 10:00 AM IST
ఆ స్టార్ హీరో ఒపీనియన్ ఏంటి? ఏం చేస్తారు?
X

స్టార్ హీరోలు సాధారణంగా ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నిర్మాత పరిస్థితి, ప్రాజెక్టు బడ్జెట్, ఫైనాన్స్ వంటి అంశాలను పరిశీలించి.. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఓ స్టార్ హీరో తన అప్ కమింగ్ మూవీ విషయంలో ఏం చేస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆ సినిమా నిర్మించనున్న ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక ఒత్తిడిలో ఉందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే సదరు నిర్మాణ సంస్థ.. వరుసగా భారీ ప్రాజెక్టులు ప్రకటించి ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్టార్ హీరో తీసుకునే నిర్ణయం ఆ బ్యానర్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. మరేం చేస్తారో చూడాలని అంతా మాట్లాడుకుంటున్నారు.

నిజానికి ఆ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఇద్దరు ప్రముఖ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. కానీ ఆ సినిమాల్లో ఒకటి విడుదలకు ఇంకా లైన్ క్లియర్ చేసుకోలేకపోయింది. మరో సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో ప్రకటించిన సమయానికి ఆ రెండు చిత్రాలు థియేటర్లకు రాకపోవడం నిర్మాతకు ఆర్థికంగా ఒత్తిడిని పెంచిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అదే సమయంలో ఆ నిర్మాణ సంస్థ మరో భారీ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరో, సక్సెస్ ఫుల్ దర్శకుడి కాంబినేషన్‌ లో ఆ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్టు పై ఇప్పటికే టాలీవుడ్‌ లో చర్చ కూడా మొదలైంది. అయితే ప్రస్తుతం పరిస్థితి పరిశీలించి కొందరు.. ఆ స్టార్ హీరోకు జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నిర్మాత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వెంటనే కొత్త సినిమా ప్రారంభిస్తే మధ్యలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఫైనాన్స్ సమస్య తీవ్రంగా ఉంటే సినిమా షూటింగ్ మధ్యలో నిలిచిపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి సందర్భాల్లో అందుకే ఆ ప్రాజెక్టుపై ఆ స్టార్ హీరో ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరోవైపు నిర్మాత మాత్రం ఆశలు వదులుకోకుండా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్లాన్ చేసిన ప్రాజెక్టు ప్రారంభించాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే పరిస్థితులు అనుకూలంగా మారితేనే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లే అవకాశముందని చెప్పాలి. మొత్తంగా చూస్తే భారీ బడ్జెట్ సినిమాలతో సంచలనం సృష్టించిన ఆ కొత్త బ్యానర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి సదరు స్టార్ హీరో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.