Begin typing your search above and press return to search.

మేక‌ర్స్‌ని రెండు సార్లు చావు దెబ్బ కొట్టిన స్టార్ హీరో!

ఈ మూవీ విష‌యంలో స‌ద‌రు నిర్మాణ సంస్థ న‌ష్ట‌పోయింది రూ.80 కోట్లు. ఈ న‌ష్టాన్ని భ‌ర్తీ చేయ‌డం కోసం స‌ద‌రు నిర్మాణ సంస్థ‌కు సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడు హీరో.

By:  Tupaki Entertainment Desk   |   26 Jan 2026 2:00 PM IST
మేక‌ర్స్‌ని రెండు సార్లు చావు దెబ్బ కొట్టిన స్టార్ హీరో!
X

రాజ‌కీయాల్లో ప్ర‌ధాన పార్టీల‌న్నీ గెలుపు గుర్రాల వెంట ప‌రుగెడుతుంటాయి. వారైతేనే త‌మ‌కు కావాల్సిన సీట్లొస్తాయ‌ని, త‌ద్వారా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చ‌ని భావిస్తుంటాయి. అందుకు తొలి ప్రాధాన్య‌త గెలుపు గుర్రాల‌కు ఇస్తుంటాయి. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనూ క్రేజీ ఫిల్మ్ మేక‌ర్స్ స్టార్స్‌కి, భారీ స్థాయిలో మార్కెట్‌ని పుల్ చేసే హీరోల‌కే ప్రాధాన్య‌త ఇస్తుంటారు. వారి వెంటే ప‌రుగులు పెడుతుంటారు. అయితే కొన్ని సార్లు వారి అంచ‌నా ఫ‌లించి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌లు ద‌క్కితే..కొన్ని సార్లు బెడిసికొట్టి కోట్ల‌ల్లో న‌ష్టాల‌ని ఎదుర్కోవాల్సిన‌ ప‌రిస్థితి.

అయినా స‌రే మ‌రో సినిమాతో ఆ న‌ష్టాలని భర్తీ చేసుకోవ‌చ్చులే అని స‌ద‌రు ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు డేంజ‌ర్ అని తెలిసినా మ‌ళ్లీ అదే స్టార్‌తో కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమాలు తీయ‌డానికి రెడీ అయిపోతుంటాయి. ఇలాగే ఓ క్రేజీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ హీరో వెంట‌ప‌డి బ్యాక్‌టు బ్యాక్ కోట్లు పోగొట్టుకుంటూ చేతులు కాల్చుకుంటోంది. చిన్న సినిమాల‌తో ప్ర‌యాణం ప్రారంభించిన స‌ద‌రు నిర్మాణ సంస్థ చేసింది ఎక్కువ సినిమాలే అయినా స‌క్సెస్‌లు సాధించింది మాత్రం చాలా త‌క్కువ‌. యంగ్ హీరో న‌టించ‌గా ఓ నిర్మాణ సంస్థ‌తో క‌లిసి చేసిన మిస్ట‌రీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌తో తొలి పాన్ ఇండియా హిట్‌ని సొంతం చేసుకుంది.

ఆ త‌రువాత ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ జోష్‌తో సోలోగా సినిమాలు నిర్మించ‌డం మొద‌లు పెట్టింది. అందులో ఒక‌టి అర మాత్ర‌మే స‌క్సెస్ సాధించాయి. దీంతో బిగ్ గేమ్ ఆడాల‌ని పాన్ ఇండియా హీరోతో భారీ సినిమా కోసం రంగంలోకి దిగింది. ఈ క్ర‌మంలోనే ముందుగా స‌ద‌రు స్టార్ హీరో న‌టించిన ఓ భారీ మూవీని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే బాధ్య‌త‌ల్నినెత్తినెత్తుకుంది. అయితే స‌ద‌రు స్టార్ హీరో న‌టించిన మైథ‌లాజిక‌ల్ డ్రామా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు గురై మేక‌ర్స్‌కు, స‌ద‌రు నిర్మాణ సంస్థ భారీ న‌ష్టాల‌ని తెచ్చి పెట్టింది.

ఈ మూవీ విష‌యంలో స‌ద‌రు నిర్మాణ సంస్థ న‌ష్ట‌పోయింది రూ.80 కోట్లు. ఈ న‌ష్టాన్ని భ‌ర్తీ చేయ‌డం కోసం స‌ద‌రు నిర్మాణ సంస్థ‌కు సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడు హీరో. అనుకున్న‌ట్టే కొత్త క‌థ‌తో సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేశాడు. యంగ్ డైరెక్ట‌ర్‌ని రంగంలోకి దించాడు. కొత్త జోన‌ర్‌లో క‌థ‌ని సిద్ధం చేశారు. నెల‌ల త‌ర‌బ‌డి షూటింగ్ చేస్తూ వ‌చ్చారు. లాంగ్ మార‌థాన్ త‌ర‌హాలో ఈ మూవీ షూటింగ్ జ‌రిగింది. హీరోకు కుదిరిన‌ప్పుడు షూటింగ్ చేస్తూ వ‌చ్చారు. ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ కూడా అప్పుడెప్పుడో రిలీజ్ చేసి దాన్ని మ‌ర్చిపోయిన త‌రువాత మ‌రోక‌టి వ‌దిలారు.

ఇలా ఆగుతూ సాగుతూ వ‌చ్చిన ఈ ప్రాజెక్ట్‌పై మొద‌టి నుంచే అంద‌రిలో అనుమానాలు ఏర్ప‌డ్డాయి. ఇది అవుతుందా? .. అనుకున్న విధంగా వ‌స్తుందా?.. వ‌చ్చినా అభిమానుల్ని, సినీ ల‌వ‌ర్స్‌ని ఆక‌ట్టుకుంటుందా? అని..అంతా అనుమానించిన‌ట్టే సినిమా ఈ సంక్రాంతికి విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అనిపించుకుని మేక‌ర్స్‌తో పాటు హీరోగారి హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. ఇలా స్టార్ హీరోని న‌మ్మి బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు భారీ స్థాయిలో కోట్లు న‌ష్ట‌పోవ‌డంతో స‌ద‌రు నిర్మాణ సంస్థ ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. రెండు సార్లు స‌ద‌రు హీరోని న‌మ్మి కోట్ల రూపాయ‌లు న‌ష్ట‌పోయిన స‌ద‌రు నిర్మాణ సంస్థ ఇక‌నైనా ఈ ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డుతుందా? వ‌ఏచి చూడాల్సిందే.