Begin typing your search above and press return to search.

నిరాశలో ఫ్యాన్స్‌: సూప‌ర్‌స్టార్‌ భారీ ప్రాజెక్ట్ అర్థాంత‌రంగా క్యాన్సిల్

ప్రముఖ నటుడు తన విలక్షణమైన చిత్రాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం అత‌డు నటిస్తున్న తాజా హారర్ కామెడీ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఒక ఆసక్తికరమైన, షాకింగ్ విషయం రివీలైంది.

By:  Sivaji Kontham   |   19 April 2026 7:00 PM IST
నిరాశలో ఫ్యాన్స్‌: సూప‌ర్‌స్టార్‌ భారీ ప్రాజెక్ట్ అర్థాంత‌రంగా క్యాన్సిల్
X

ప్రముఖ నటుడు తన విలక్షణమైన చిత్రాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం అత‌డు నటిస్తున్న తాజా హారర్ కామెడీ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఒక ఆసక్తికరమైన, షాకింగ్ విషయం రివీలైంది. గత ఐదేళ్ల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకగా ప్రకటించిన ఒక భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా రద్దు చేసార‌ని తెలిసింది. ఈ స‌మాచారం లీక్ అవ్వ‌డంతో మూవీ రాక‌ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

సాధారణంగా ఈ ప్రముఖ నటుడు ఏడాదికి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కొత్త సినిమాల ప్రకటనలు చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. అదే విధంగా 2021లో ఒక విశిష్టమైన సైనిక నేపథ్యం ఉన్న సినిమాను ప్రకటించారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా ఆ సమయంలో విడుదల చేయడంతో ప్రేక్షకులు ఆ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆయన భారత సైన్యానికి చెందిన ఒక వీర సైనికుడి పాత్రలో కనిపించాల్సి ఉంది.

ఇటీవల త‌న‌ లేటెస్ట్ మూవీ ప్రమోషన్ల కోసం నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సదరు సైనిక నేపథ్య చిత్రం గురించి ప్రస్తావిస్తూ.. ఆ సినిమా నిర్మాణం ప్రస్తుతానికి నిలిచిపోయిందనే విష‌యం చెప్ప‌డానికి ఆయ‌న ఇబ్బంది ప‌డ్డారు. సంజయ్ పురాణ్‌ సింగ్ చౌహాన్ దర్శకత్వంలో.. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాణంలో రావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల వెనక్కి వెళ్ళిపోయింది.

ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలను ఆయన పూర్తిగా వివరించ‌లేదు కానీ.. ఆ సినిమా ఇక రాదని తేలిపోవడంతో సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఒక గొప్ప కథను వెండితెరపై చూడలేకపోతున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రముఖ హీరో తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అత‌డి చేతిలో మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి.

మరోవైపు సుమారు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన ఫేవరెట్ దర్శకుడు ప్రియదర్శన్‌తో కలిసి ఈ ప్రముఖ నటుడు `భూల్ భులయ్యా 3` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏప్రిల్ 16 నుండి పెయిడ్ ప్రివ్యూలతో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. గత కొన్ని పరాజయాల తర్వాత ఈ చిత్రం అత‌డికి ఘనమైన పునరాగమనాన్ని ఇస్తుందని చిత్ర బృందం, అభిమానులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.