Begin typing your search above and press return to search.

గొప్ప మ‌న‌సు చాటుకున్న స్టార్ హీరో!

ఒక ద‌శ‌లో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించినా తరువాత ఫ్లాపుల‌కే ప‌రిమిత‌మైతే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అత్య‌ధిక శాతం మంది అలాంటి వారికి ముఖం చాటేస్తుంటారు.

By:  Ravindar Gorantla   |   25 Feb 2026 6:00 AM IST
గొప్ప మ‌న‌సు చాటుకున్న స్టార్ హీరో!
X

ఇండ‌స్ట్రీలో అధిక ప్రాధాన్య‌త టాలెంట్‌..స‌క్సెస్‌ల‌కే. ఈ రెండూ లేక‌పోతే ఇక్క‌డ ఎవ‌రూ గుర్తించ‌రు. స‌క్సెస్ లేక‌పోతే ఇక్క‌డ ప‌ట్టించుకునే నాధుడే ఉండ‌డు అన్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. వ‌రుస ఫ్లాపుల్లో ఉంటే అలాంటి వారిని లెక్క‌లోకే తీసుకోరు. ఫోన్ చేసినా.. మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నించినా దూరం పెడుతుంటారు. ఒక ద‌శ‌లో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించినా తరువాత ఫ్లాపుల‌కే ప‌రిమిత‌మైతే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అత్య‌ధిక శాతం మంది అలాంటి వారికి ముఖం చాటేస్తుంటారు. ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొన్న డైరెక్ట‌ర్‌కు అండ‌గా నిలిచాడో స్టార్ హీరో.

ఈ సంద‌ర్భంగా త‌న గొప్ప మ‌న‌సుని చాటుకున్నారు. అత‌నో స్టార్ డైరెక్ట‌ర్. ఒకానొక ద‌శ‌లో ఎంతో మంది స్టార్ల‌కు గుర్తిండిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని, మ‌ర్చిపోలేని క్యారెక్ట‌ర్లని రాసి త‌న సినిమాల్లో న‌టించిన స్టార్ల‌కు ప్రేక్ష‌కుల్లో, అభిమానుల్లో ప్ర‌త్యేక గుర్తింపుని, భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్‌ క్రియేట్ అయ్యేలా చేశారు. అలాంటి డైరెక్ట‌ర్ ఈ మ‌ధ్య కాలంలో చాలా గ‌డ్డుప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అది తెలిసిన స్టార్ హీరో స‌ద‌రు డైరెక్ట‌ర్ ఇబ్బందిని గ‌మ‌నించి అత‌నికి రూ.5 కోట్లు స‌హాయం చేయ‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

స‌ద‌రు డైరెక్ట‌ర్‌తో స్టార్ హీరో చేసిన సినిమాలేవీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయినా త‌న వ‌ల్ల, త‌న సినిమాల వ‌ల్ల త‌న‌కు భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఆ కృత‌జ్ఞ‌త‌ని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందుల్లో ఉన్న డైరెక్ట‌ర్‌ని ఆదుకున్నార‌ట‌. గ‌త కొంత కాలంగా కెరీర్ విష‌యంలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్న డైరెక్ట‌ర్ టాలెంటెడ్ హీరోతో ఓ మూవీకి శ్రీ‌కారం చుట్టారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఆగిపోయే ప‌రిస్థితికి చేరుకుంద‌ట‌.

ఈ విష‌యం తెలుసుకున్న స్టార్ హీరో డైరెక్ట‌ర్‌పై ఉన్న ప్రేమ‌, అభిమానంతో సినిమా ఆగిపోకూడ‌ద‌ని ఏకంగా రూ.5 కోట్లు పంపించి త‌న వంతు స‌హాయం చేశాడ‌ట‌. దీంతో స‌ద‌రు డైరెక్ట‌ర్ క‌ష్ట‌కాలంలో త‌న‌కు అండ‌గా నిలిచిన స్టార్ హీరోకు ఎలా కృతజ్ఞ‌త‌లు చెప్పాలో తెలియ‌క భావోద్వేగానికి లోనైన‌ట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఎలాంటి రిట‌ర్న్స్ ఆశించ‌కుండా ఇబ్బందుల్లో ఉన్న డైరెక్ట‌ర్‌ని ఆదుకోవ‌డానికి స్టార్ హీరో ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌ని, ఇండస్ట్రీలో క‌ష్టాల్లో ఉన్నారంటే ముఖం చాటేస్తుంటార‌ని, అలాంటిది నీకు నేనున్నాన‌ని స‌ద‌రు హీరో భ‌రోసా ఇవ్వ‌డం అంద‌రిని ఆలోచింప‌జేస్తోంద‌ని అంతా అంటున్నారు.